EPAPER

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Papad History: పప్పన్నం తింటున్నా, పెరుగన్నం తింటున్నా, సాంబార్ తో తింటున్నా పక్కన అప్పడాలు, వడియాలు లాంటివి ఉండాలి. అప్పుడే ఆ భోజనం అదిరిపోతుంది. ఇవి భోజనంతో పాటు తినే రుచికరమైన చిరుతిండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ వడియాలు, అప్పడాలను మనం ఎప్పటి నుంచి తింటున్నామో, వీటి చరిత్ర ఈనాటిది కాదు… 2500 సంవత్సరంల నాటిది. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం అప్పడాలు, వడియాలు లాంటివి మనదేశంలోనే పుట్టాయి. 2500 సంవత్సరాల నుంచి మన భోజనంలో అప్పడాలు భాగం అయిపోయాయి.


పురాతన బౌద్ధ జైన గ్రంథాలలో అప్పడాల ప్రస్తావన ఉంది. ఆహార చరిత్రకారులు ఎంతోమంది తమ పుస్తకాలలో అప్పడాల చరిత్రను రాసుకొచ్చారు. అప్పట్లో మినప్పప్పు, కాయ ధాన్యాలను కలిపి మెత్తగా చేసి అప్పడాలను చేసేవారని రాసుకొచ్చారు. జైన సాహిత్యంలో 1500 వేల క్రితం కూడా అప్పడాల ప్రస్తావన ఉంది. జైన యాత్రికులు తమతో పాటు అప్పడాలను కూడా తీసుకెళ్లేవారని అవి చాలా తేలికగా ఉంటాయని, పైగా రుచిగా కూడా ఉంటాయని వారి భావించే వారిని చరిత్ర చెబుతోంది. వాటిని తమతో పాటు మోసుకెళ్ళడం చాలా సులువు. కాబట్టి అప్పడాలను ఎక్కువగా జైన భక్తులు, యాత్రికులు తమతో పాటు తీసుకెళ్లేవారని అంటారు.

అప్పట్లో కూడా స్త్రీలు అందరూ కలిసి గంటల తరబడి పప్పులు రుబ్బుతూ అప్పడాలు చేసేవారని చెబుతారు. ఈ సంప్రదాయం నేటికీ కొన్ని పల్లెటూర్లలో ఉంది. నలుగురైదుగురు మహిళలు కలిసి అప్పడాలను తయారు చేస్తారు. తయారైన అప్పడాలను నాలుగు ఇళ్లవారు సర్దుకుంటారు. ఒకరే అప్పడాలు చేస్తే త్వరగా అలసిపోతారు.


Also Read: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

అప్పడాలలో లిజ్జత్ పాపడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని 1959 లో ఏడుగురు గుజరాతీ మహిళలు కలిసి తయారు చేశారని చెబుతారు. ఇప్పుడు లిజ్జత్ పాపడ్ పెద్ద వ్యాపారంగా విస్తరించింది. ఇలా చేసింది కూడా ఆ ఏడుగురు గుజరాతీ మహిళలే. ఇప్పుడు ఈ అప్పడాలకు భారతదేశమంతా అభిమానులు అయిపోయారు. చాలా చోట్ల అప్పడాలను తయారు చేస్తూ వేలాదిమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

అప్పడాలలో ఇప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి. పెసరపప్పుతో చేసేవి, మినప్పప్పుతో చేసేవి, బియ్యంతో చేసేవి, ఆకుకూరలతో చేసేవి, మిరియాలు దట్టించి చేసేవి… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల అప్పడాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఏవైనా కూడా కాస్త నూనె వేడెక్కగానే వేస్తే చాలు క్రిస్పీగా మారిపోతాయి. అందుకే వాటికి అభిమానులు ఎక్కువ. టేస్టీ సాంబార్ రైస్ తో అప్పడం తింటే స్వర్గం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పడాలు ఉండడం ఇప్పుడు సహజంగా మారిపోయింది.

Related News

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Big Stories

×