EPAPER

Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Cancer Causing Chemicals In Cooking Utensils: వంటలు ఎందులో చేస్తారు? చాలా మంది అల్యుమినియం పాత్రల్లో చేస్తారు. కొంత మంది స్టీల్ పాత్రల్లో వంట చేస్తారు. మరికొంత మంది కాపర్ పాత్రల్లో ఫుడ్ రెడీ చేస్తే, ఇంకొంత మంది  మట్టి పాత్రల్లో ఆహారం వండుతారు. పై వంటపాత్రలతో పెద్దగా ముప్పులేకపోయినా, నాన్ స్టిక్ పాత్రలు, బ్లాక్ ప్లాస్టిక్ పాత్రలతో ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు పరిశోధకులు. రీసైక్లింగ్ పద్దతుల్లో పొరపాట్ల కారణంగా వంట పాత్రలు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయంటున్నారు. తాజాగా సుమారు 203 రకాల వంట పాత్రలను నిపుణులు పరిశీలించారు. ఇందులో చాలా పాత్రల్లో బ్రొమిన్ అనే డేంజరస్ రసాయనం ఉన్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనానికి సంబంధించిన వివరాలను కెమోస్పియర్ జర్నల్‌లో ప్రచురించారు.


నల్లటి వంట పాత్రలు చాలా డేంజర్

తాజా పరిశోధనలో వంట పాత్రలు, టేక్ అవే కంటేనర్లతో పాటు పిల్లల బొమ్మల్లో ఉపయోగించే నలుపు రంగు ప్లాస్టిక్స్ లో బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్(BFRs)  ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. బ్రోమిన్ సహా పలు రకాల విష రసాయనాలు వంటపాత్రల్లో ఉన్నట్లు వెల్లడైంది. వీటి కారణంగా క్యాన్సర్, ఎండోక్రైన్ సమస్యలు న్యూరో టాక్సిసిటీ, పునరుత్పత్తి సమస్యలు కలుగుతున్నట్లు గుర్తించారు. వంటగదుల్లో ఉపయోగించే నాన్ స్టిక్ తో పాటు నల్లటి ప్లాస్టిక్ పాత్రల కారణంగా రోజుకు మనిషి శరీరంలోకి 34,700 పీపీఎం విషరసాయనాలు చేరుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. పాలీబ్రోమినేటెడ్ డైఫినైల్ ఈథర్స్ (PBDEలు)పై ఆంక్షలు విధించిన నేపథ్యంలోబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్(BFRs)కు ఆదరణ పెరిగింది. వీటిని గతంలో ఫర్నిచర్, టెక్స్‌ టైల్స్, ఎలక్ట్రికల్ పరికరాలతో సహా వివిధ రకాల ఉత్పత్తులలో ఫ్లేమ్ రిటార్డెంట్లుగా ఉపయోగించేవారు. PBDEలతో పర్యావరణానికి తీవ్ర ముప్పు కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని నిషేధించారు. BFRsను వస్తువులను వాడుతున్నారు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు పరిశోధకులు.


Read Also:  అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

బ్లాక్ ప్లాస్టిక్ ను వాడటం మానేయండి

ప్రజలు ప్రమాదకర క్యాన్సర్ కారణాలు ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ బొమ్మలతో పాటు ఫుడ్ కాంటాక్ట్ మెటీరియల్స్ కోసం బ్లాక్ ప్లాస్టిక్‌ ను ఉపయోగించడం మానుకోవాలని పరిశోధకులు  సూచిస్తున్నారు. అంతేకాదు, ఈ ఏడాది ప్రారంభంలో ప్రచురించిన అధ్యయనం ప్లాస్టిక్, నాన్-స్టిక్ వంట పాత్రల ద్వారా ఫుడ్ లో ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్స్ కలుస్తున్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్ వంట పాత్రల కారణంగా ఆహారం ద్వారా వేలాది మైక్రో ప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. నాన్ స్టిక్ వంట పాత్రల ద్వారా మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లకపోయినా, ప్రమాదకర విష రసాయనాలు చేరుతున్నట్లు వెల్లడించారు. వీలైనంత వరకు నలుపు రంగు ప్లాస్టిక్ వంట పాత్రలను ఉపయోగించకపోవడం ఉత్తమం అని పరిశోధకులు తెలిపారు. పిల్లలకు నల్లరంగులో ఉన్న ఆట బొమ్మలను కూడా కొనివ్వకూడదన్నారు.

Read Also: వామ్మో సెల్ ఫోన్, పిల్లలకు అస్సలు ఇవ్వకండి, లేదంటే ఈ ముప్పు తప్పదు!

Related News

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Moringa and Beauty: మునగాకులను ఇలా వాడితే మొటిమలు రావడం దాదాపు తగ్గిపోతాయి

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Big Stories

×