Early Aging: మహిళలు యవ్వనంగా కనిపించడానికి వివిధ పద్ధతులను అవలంభిస్తారు. కానీ మీకు తెలుసా ? మనం చేసే రోజు వారి కార్యక్రమాలు కూడా త్వరగా వృద్దాప్యం రావడానికి కారణం అవుతాయి.కొన్ని రకాల అలవాట్ల వల్ల చర్మ కణాలు సరిగా పనిచేయలేవు. ఫలితంగా ముఖంపై మచ్చలు , ముడతలు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం కూడా వదులుగా మారడం ప్రారంభమవుతుంది. కొన్ని సాధారణ తప్పులు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. ఇలాంటి సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు.
ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత వృద్ధాప్య సమస్యలను ఎదుర్కోవడం కామన్. వయస్సు పెరిగే కొద్దీ చర్మం యొక్క గ్లో క్రమంగా తగ్గుతుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు కూడా కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ సమస్యను ఎదుర్కోవటానికే, చాలా మంది మహిళలు వివిధ కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొంత మంది పక్కా డైట్ కూడా ఫాలో అవుతుంటారు. కానీ మన రోజువారీ అలవాట్లలో అకాల వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయి. మనం మన చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే త్వరగా ముసలివాళ్ల లాగా కనిపిస్తారు. నిజానికి మన చెడు అలవాట్లు కొన్ని చర్మ కణాలను దెబ్బతీస్తాయి.
నిద్ర లేకపోవడం:
బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక వ్యక్తి రోజు 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. ఒక పరిశోధన ప్రకారం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల చర్మం సున్నితత్వం తగ్గుతుంది. నిజానికి, నిద్ర లేకపోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు:
తియ్యటి, ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. దీని వల్ల శరీరానికి పోషకాలు సరిగా అందక త్వరగా వృద్ధాప్యం కనిపించడం మొదలవుతుంది. ప్యాక్ చేసిన ఆహారంలో మన జీర్ణవ్యవస్థకు హాని కలిగించే అనేక రకాల రసాయనాలు ఉంటాయి.అంతే కాకుండా మనం తక్కువ నీరు త్రాగినప్పుడు మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా కొల్లాజెన్ తగ్గుతుంది. కొల్లాజెన్ మన చర్మం, జుట్టును బలంగా ఉంచుతుంది. నీరు తగినంత త్రాగకపోవడం వల్ల విటమిన్ సి కూడా తగ్గిపోతుంది.దీని వల్ల చర్మం, జుట్టు పొడిబారుతుంది. ఫలితంగా చిన్న వయస్సులోనే ముసలివాళ్ల లాగా కనిపిస్తాం.