Comb Cleaning Tips : రోజూ మనం వాడే దువ్వెన చాలా వరకు మురికి పట్టి ఉంటుంది. చాలామంది దువ్వెన నల్లగా మారితే తప్ప దాన్ని శుభ్రం చేయరు. అలా చేయడం వల్ల తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దువ్వెనను సులభంగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
క్లీనింగ్ ఇలా..
బేకింగ్ సోడాలో కాసిని నీళ్లు కలిపి.. అందులో ఓ అరగంట పాటు దువ్వెనలను నాననివ్వాలి. ఆపై టూత్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మురికి పోతుంది.
ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా షాంపూ వేసి, తగినన్ని నీళ్లు కూడా వేసి ఆ నీటిలో హెయిర్ బ్రష్‌ను ఓ ఐదు నిమిషాలు ఉంచితే.. అప్పుడు మురికంతా పోయి దువ్వెన శుభ్రపడుతుంది.
ఒక బౌల్లో కొద్దిగా వెనిగర్ వేసి తగినన్ని నీళ్లు కలిపి దువ్వెనలని ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగాలి. వెనిగర్‌కి బదులుగా నిమ్మరసాన్ని వాడొచ్చు. దీంతో దువ్వెనలు మెరుస్తాయి.