EPAPER

Coconut Water : కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

Coconut Water : కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

Coconut Water


Coconut Water Benefits : సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. పగటి పూట ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో సహజంగా మనకు గుర్తొచ్చే పానీయాల్లో ముఖ్యమైనవి కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు నోటికి చాలా రుచిగా ఉంటాయి. అలానే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీటిలో ఉండే పోషకాలు, మినరల్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కొబ్బరి నీళ్లు అలసిపోయినప్పుడు తీసుకుంటే శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. శరీర బరువును అదుపు చేయడంలోనూ కొబ్బరీ నీళ్లు సహాయపడతాయి. రక్తపోటు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ కొందరు కొన్ని అపోహలతో కొబ్బరి నీళ్లను దూరం పెడుతున్నారు. అటువంటి వారి కోసం కొబ్బరి నీళ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


Read More : సమ్మర్.. బైక్ రైడర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి!

కొబ్బరి నీళ్లలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అంతేకాకుండా గుండె, మూత్రపిండాలతో సహా అన్ని అవయవాలకు ప్రయోజనాలను అందిస్తాయి కొబ్బరి నీళ్లు. ప్రస్తుత కాలంలో కొబ్బరి నీళ్ల ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతల నుంచి డీహైడ్రేషన్ సమస్యల నుంచి బయటపడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీటిలో కొవ్వు ఉండదు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీని ద్వారా శరీరానికి హాని కలిగించకుండా నిరోధిస్తాయి. కొబ్బరి నీళ్లలో పెద్ద మొత్తంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి ఎనర్జీ బూస్ట‌ర్‌గా ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో ఎనర్జీ డ్రింక్ కంటే పొటాషియం అధికంగా ఉంటుంది. వ్యాయామం చేసేప్పుడు కొబ్బరి నీళ్లను కొంచెం.. కొంచెం సిప్ చేస్తే మంచి శక్తి లభిస్తుంది.

సోడా లేదా జ్యూస్, ఇతర పానీయాలతో పోలిస్తే హైడ్రేటెడ్‌గా ఉండటానికి కొబ్బరి నీళ్లు ఆ ఆరోగ్యకరమైన ఎంపిక. శక్తి స్థాయిలను పెంచడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడంలో కొబ్బరి నీళ్లు పనిచేస్తాయి.

కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎముకలు , దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలానే ఈ నీటిలో ఉంటే పొటాషియం.. రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహాయపడుతుంది.

Read More : రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

కొబ్బరి నీళ్లను కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తీసుకుంటే.. మూత్రవిసర్జన ద్వారా పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్‌లను తొలగిస్తుంది. 2018 లో నిర్వహించిన ఓ అధ్యయనం దీనిని స్పష్టం చేసింది.

కొబ్బరి నీళ్లను గర్భిణులు తీసుకుంటే చాలా మంచిది. వీటిలో ఉండే .. విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లలోని పొటాషియం.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది.

Disclaimer : ఈ కథనాన్ని పలు వైద్య అధ్యయనాలు , మెడికల్ జర్నల్స్ ప్రకారం మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Tags

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×