EPAPER

Stammering Facts : పిల్లలకు నత్తి ఉంటే ఎలా తగ్గించాలి?

Stammering Facts : పిల్లలకు నత్తి ఉంటే ఎలా తగ్గించాలి?
Stammering Facts
Stammering Facts

Stammering Facts : చిన్న పిల్లలు ఎక్కువగా నత్తిగా మాట్లాడుతుంటారు. అంటే మాటలు తడబడుతుంటాయి. ఇలా మాట్లాడటం అనేది న్యూరో డెవలప్ మెంటల్ సమస్య. ఇది
చిన్నపిల్లల్లో 2 నుంచి 6 సంవత్సరాల మధ్యలో కనిపిస్తుంది. పెద్దల్లో అయితే ఈ సమస్య 1 శాతంగా ఉంటుంది. 8 శాతం మంది పిల్లలు ఏదో ఒక సమయంలో నత్తిగా మాట్లాడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వయసు పెరిగేకొద్ది తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం ఇది తీవ్రంగా ఉంటుంది.


పిల్లలు నత్తిగా మాట్లాడటం తల్లిదండ్రులకు బాధించే విషయం. ఈ సమస్యకు స్పీచ్ థెరపీతో కొంత వరకు పరిష్కారం చూపొచ్చు. చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ ప్రయత్నాల వల్ల నత్తి పూర్తిగా నయమవుతుందా అనేది ప్రశ్నగానే ఉంది. కొంతమంది పిల్లలు మాట్లాడేటప్పుడు బాగా తడబడతారు. చెప్పాలనుకున్నది అనర్గళంగా చెప్పలేరు.

READ MORE : ఈ ప్రదేశంలో తరచూ నొప్పి ఉంటుందా.. బ్రెయిట్ ట్యూమర్ కావొచ్చు!


ఇది కుటుంబం నుంచి జన్యుపరంగా వచ్చే సమస్య అని గుర్తుంచుకోండి. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కానీ దీనిని అధ్యయనాలు పూర్తిగా స్పష్టం చేయలేదు. ఎందుకంటే కవలల్లో ఒకరికి నత్తి ఉంటే.. మరొకరికి ఉండకపోవచ్చు.

నత్తిగా మాట్లాడేవారిలో బ్రెయిన్ పనితీరులో కొన్ని స్వల్పమైన తేడాలు ఉంటాయి. ఈ విషయాన్ని కొన్ని బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనాలు వెల్లడించాయి. మెదడులోని కొన్ని భాగాల నిర్మాణంలో చిన్నపాటి తేడాలు కూడా ఇందుకు కారణం కావచ్చు.

నత్తి మూడు రకాలు

  • స్వల్పం ఉండటం
  • మధ్యస్థంగా ఉండటం
  • తీవ్రంగా ఉండటం

నత్తి సమస్య పిల్లల్లో మధ్యస్థంగా ఉంటే.. త్వరగానే కోలుకుంటారు. ఇలా ఉన్న వారు 4 నుంచి 5 నెలలు థెరపీ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. నత్తి సమస్య తీవ్రంగా ఉన్న పిల్లలకు చికిత్స అందించడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమస్య అనేది 30 నుంచి 40 శాతం వరకు నయం అయ్యే అవకాశం ఉంది. థెరపీ, ఇతర ప్రయత్నాల ద్వారా తగ్గించొచ్చు.

READ MORE : పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

నత్తి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భయం వ్లల కూడా ఈ సమస్య రావొచ్చు. దీని ప్రభావాన్ని కూడా తగ్గించొచ్చు.

నత్తి ఉన్న వారితో ఎలా వ్యవహరించాలి

  • వారు చెబుతున్న మాటలను త్వరగా ముగించేందుకు ప్రయత్నించవద్దు.
  • వారు మాట్లాడేటప్పుడు మధ్యలో వెళ్లొద్దు.
  • సహనంగా ఉండాలి.
  • త్వరగా లేదా చిన్నగా మాట్లాడాలని అడగవద్దు.
  • వారు మాట్లాడేటప్పుడు కళ్లలోకే చూడండి.
  • వారు ఎలా చెబుతున్నారో వినండి.
  • ఏం చెబుతున్నారనే దానిపై శ్రద్ధ పెట్టండి.
  • పిల్లలతో నిదానంగా మాట్లాడండి.
  • చిన్న చిన్న వాక్యాలను వాడండి.
  • వారికి సులభతరమైన భాషలోనే మాట్లాడండి.
  • మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకునేందుకు వారికి సరిపడా సమయం ఇవ్వండి

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×