EPAPER
Kirrak Couples Episode 1

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Face Mask: శరీర ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. శరీర ఆరోగ్యాన్ని కాదు..చియా విత్తనాలు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తాయి. చియా గింజలతో తయారుచేసిన సహజమైన ఫేస్ మాస్క్‌లు ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మార్కెట్‌లో లభించే ఖరీదైన ఫేస్ మాస్క్‌లతో పోలిస్తే, చియా విత్తనాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ చాలా చౌకగా తయారు చేసుకోవచ్చు.


ముఖ్యంగా ఇది మొటిమలను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉన్న మృత చర్మాన్ని తొలగించి, ముఖం కాంతిని పెంచడంలో సహాయపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.చియా సీడ్స్, తేనెతో ఫేస్ మాస్క్ ..
కావాల్సినవి:


చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం- 1/2 టీ స్పూన్
తేనె- 1/2 టీ స్పూన్

తయారీ విధానం:  ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో చియా సీడ్స్, నిమ్మ రసం, తేనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి.

2.చియా సీడ్స్, తేనె, ఆలివ్ ఆయిల్ ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1/2 టీ స్పూన్
ఆలివ్ ఆయిల్- 1/2 టీ స్పూన్

తయారీ విధానం: చియా గింజలతో ఫేస్ మాస్క్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో చియా సీడ్స్, ఆలివ్ ఆయిల్ , తేనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా వేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మెరుస్తుంది.

3. చియా గింజలు, కొబ్బరి నూనె ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- 1/2 టేబుల్ స్పూన్

తయారీ విధానం: చియా గింజలు, కొబ్బరి నూనెతో ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, గిన్నెలో 2 స్పూన్ల చియా గింజలను వేసి కొంత నీరు కలపండి. కొంత సమయం తరువాత, కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ మాస్క్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. దీని ద్వారా చర్మం మృదువుగా మారుతుంది.

Also Read: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

4.చియా గింజలు, పాలతో ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్ – 2 టేబుల్ స్పూన్లు
పాలు – సరిపడినంత

తయారీ విధానం: చియా విత్తనాలు, పాలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి ముందుగా 2 చెంచాల చియా గింజల్లో తగినంత పాలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం చల్లబడి చర్మం మృదువుగా, మెరిసిపోతుంది. అంతే కాకుండా తరుచుగా దీనిని వాడటం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

Related News

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Camphor Benefits: కర్పూరం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

Big Stories

×