EPAPER

Diabetes and Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

Diabetes and Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే.. బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

Can Women with Diabetes Breastfeed their Babies: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. అనేక పోషకాలు ఉన్న తల్లిపాలు పసిపిల్లల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే టైప్-1, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు పిల్లలకు పాలు ఇస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లిపాలు ఎలా ప్రభావితం చేస్తాయో అని భయపడుతూ ఉంటారు. తల్లి బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటే తల్లి పాలు బిడ్డకు సురక్షితమే.. వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రక్తంలో చెక్కెర స్థాయిలు అధికంగా ఉంటే పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. శిశువుకు సమర్థవంతంగా పాలు ఇవ్వడం కష్టమవుతుంది. దీని కారణంగా బిడ్డకు సరైన పోషకాలు అందవు.


చిన్నారి అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది. తల్లి బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకుండా బిడ్డకు పాలు ఇస్తే శిశువుకు హైపోగ్లెసీమియా ముప్పు పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, ప్లెసెంటా గుండా వెళుతుంది. ఇది మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి చిన్నారి క్లోమగ్రంధిని ప్రేరేపిస్తుంది. చిన్నారిలో ఇన్సులిన్ ను అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు పడిపోతాయి. ప్రస్తుత రోజుల్లో టైప్-2 డయాబెటిస్ తో బాధపడే మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందు ఓరల్ హైపోగ్లెసీమియా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. డెలివిరీ అయిన తర్వాత ఓరల్ హైపోగ్లెసీమియా తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ జనరేషన్ సల్ఫోనెలోరియస్, క్లోర్ ప్రొపోమైడ్ తల్లిపాలల్లోకి ప్రవేశించినట్లు పరిశోధకులు గుర్తించారు.


Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ఐరన్ లోపం ఉన్నట్లే !

వీటిని దృష్టిలో ఉంచుకొని మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివిరీ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించడం చాలా ముఖ్యం. సమతుల ఆహారం, వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. బిడ్డకు పాలిచ్చే డయాబెటిక్ మహిళలు చిన్నారి బరువు, రక్తంలో చక్కెర స్థాయిలను నిశితంగా పరిశీలించాలి. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకుండా బిడ్డకు పాలు ఇవ్వడం మంచిది కాదని వైధ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Big Stories

×