EPAPER
Kirrak Couples Episode 1

Gems Colours: మీ పిల్లలకు ‘జెమ్స్’ తినిపిస్తున్నారా? ఒక్కో కలర్‌లో ఒక్కోరకమైన విషం.. ఏమేమి కలుపుతున్నారో చూడండి

Gems Colours: మీ పిల్లలకు ‘జెమ్స్’ తినిపిస్తున్నారా? ఒక్కో కలర్‌లో ఒక్కోరకమైన విషం.. ఏమేమి కలుపుతున్నారో చూడండి

Gems Colours Harmful For Children’s Health: క్యాడ్ బరీ జెమ్స్.. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఏ కిరాణా షాపులో చూసినా, ఏ బేకరీకి వెళ్లినా దండలు దండలుగా వేలాడదీస్తారు. షాపుకు వెళ్తే పిల్లలకు వీటిని కొనివ్వాల్సిందే! లేకపోతే వాళ్లు చేసే మారాం మామూలుగా ఉండదు. చాలా మంది వీటిని తినడం వల్ల పిల్లల్లో దంత సమస్యలు వస్తాయని చెప్తుంటారు. కానీ, వీటిలో కలిపే అత్యంత డేజరస్ రంగులు చిన్నారుల ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు జిటల్ కంటెంట్ క్రియేటర్ ఆదిత్య నటరాజ్. కంటికి ఇంపుగా కనిపించే అందమైన ఇంద్ర ధనస్సు లాంటి రంగుల వెనుక కనిపించని రోగాలను కలిగించే విష రసాయనాలు ఉన్నాయంటున్నారు. జెమ్స్ గురించి, వాటిలో వాడే రంగుల గురించి ఆయన ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ రంగులను పలు దేశాల్లో బ్యాన్ చేసినట్లు వెల్లడించారు.


జెమ్స్ లో కలిపే రంగులు ఇవే..

క్యాడ్ బరీ జెమ్స్ ప్యాకెట్లో గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ, ఊదా రంగుల చాక్లెట్లు ఉంటాయి. ఈ స్వీట్ చాక్లెట్స్ తయారు చేయడానికి చాలా రంగులను ఉపయోగిస్తారు. ఈ రంగుల వివరాలను ప్యాకెట్ వెనుక స్పష్టంగా రాసి ఉంటుంది. జెమ్స్ లో వాడే రంగులు 171, 102, 133, 124, 127, 122, 132, 110 రకానికి చెందినవి. ఇంతకీ ఈ రంగులేంటి? ఆ నెంబర్లు ఏంటి? వాటితో వచ్చే నష్టాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


క్యాడ్ బరీ జెమ్స్ రంగుల వెనుకున్న అసలు కథ..

కలర్ 171:

⦿ ఇది తెలుపు రంగులో ఉండే టైటానియం డయాక్సైడ్.

⦿ ఈ కలర్ ను యూరోపియన్ యూనియన్‌ బ్యాన్ చేసింది.

⦿ ఈ రంగుతో DNA దెబ్బతినే అవకాశం ఉంది.

కలర్ 102:

⦿ ఇది పసుపు రంగులో ఉండే టార్ట్రాజైన్.

⦿ ఈ రంగును ఆస్ట్రియా, నార్వే దేశాల్లో నిషేధించారు.

⦿ పిల్లలలో ఆస్తమా, హైపర్ యాక్టివిటీకి దారితీస్తుంది.

కలర్ 133:

⦿ ఇది నీలం రంగులో ఉండే బ్రిలియంట్ బ్లూ FCF.

⦿ దీనిని ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్‌ లో నిషేధించారు.

⦿ శరీరంలో ఎలర్జీ సమస్యలకు కారణం అవుతుంది.

కలర్స్ 124, 127, 122:

⦿ ఈ ఎరుపు రంగు బొగ్గు, తారుతో తయారవుతాయి.

⦿ వీటిని నార్వే, అమెరికాలో నిషేధించారు.

⦿ పిల్లలలో ఆస్తమా, హైపర్ యాక్టివిటీకి కారణం అవుతుంది.

కలర్132:

⦿ ఇది నీలం రంగులో ఉండే ఇండిగో కార్మైన్.

⦿ ఈ రంగు నార్వేలో నిషేధించబడింది.

⦿ పిల్లల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.

కలర్ 110:

⦿ ఇది పసుపు రంగులో ఉండే సన్‌సెట్ ఎల్లో FCF.

⦿ ఈరంగును కూడా నార్వేలో నిషేధించారు.

⦿ ఈ రంగు పిల్లల్లో మానసిక సమస్యలకు కారణం అవుతుంది.

ఇప్పటికైనా పిల్లలను క్యాడ్ బరీ జెమ్స్ కు దూరంగా ఉంచడం మంచిది అంటున్నారు నిపుణులు. పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా తాజా పండ్లు అలవాటు చేయాలని సూచిస్తున్నారు.

Read Also:చౌకైన ఔషధంతో బ్రెయిన్ ట్యూమర్ మాయం, ప్రాణాంతక క్యాన్సర్ కు సరికొత్త డ్రగ్ కనుగొన్న పరిశోధకులు

Related News

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Maggi Manchurian: పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ, ఇలా చేసేయండి, చూస్తేనే నోరూరిపోతుంది

SkinCare Tips: ఆరోగ్యవంతమైన, అందమైన చర్మం కోసం 6 యాంటీ ఏజింగ్ బ్యూటీ సీక్రెట్స్‌..

Japanese Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ తో వద్దన్నా కళ్లు మూతలు పడతాయ్!

Diabetes: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Big Stories

×