EPAPER

Ram Kand Mool: ఈ రామ కంద మూల్ ఎక్కడ కనిపించినా చిన్న ముక్క కొని తినండి, ఇది ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో

Ram Kand Mool: ఈ రామ కంద మూల్ ఎక్కడ కనిపించినా చిన్న ముక్క కొని తినండి, ఇది ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో
Ram Kand Mool: రామ కందమూలం అని పిలిచే ఈ దుంప చాలా రుచిగా ఉంటుంది. ఒకప్పుడు ఇవి ఎక్కువగా దొరికేవి. ఇప్పుడు మాత్రం అరుదుగా దొరకడం ప్రారంభమయ్యాయి. ఎక్కడో ఒకచోట కొంతమంది వీటిని తెచ్చి అమ్ముతూ ఉంటారు. వాటిని దుంప నుంచి పలుచగా చిన్న ముక్కను కోసి అందిస్తారు. ఇలాంటి రామ కంద మూల్ మీకు దొరికితే ఖచ్చితంగా తినేందుకు ప్రయత్నించండి.


మన దేశంలోని అడవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ముళ్ళ పొదల్లా కనిపిస్తాయి. వాటిని తవ్వితే భూమిలో ఈ దుంప లభిస్తుంది. ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి బంజర భూములలో ఈ దుంప లభిస్తుంది. కరువు, ఆహార కొరత ఉన్న సమయాల్లో ఈ దుంపలను తినే అటవీ వాసులు జీవించారని చెప్పుకుంటారు.

శ్రీరాముడు తిన్న దుంప

శ్రీరాముడు తన పద్నాలుగేళ్ల వనవాసంలో ఈ కందమూలాన్ని తినే ఎక్కువకాలం జీవించాడని చెప్పుకుంటారు. అందుకే దీనికి రామ్ కందమూల్ అనే పేరు వచ్చింది. దీన్ని తినడం ఎంతో అదృష్టంగా భావిస్తారు హిందువులు.


నిజానికి రామ్ కందమూల్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే పీచు పదార్థము కూడా ఎక్కువే. తెల్లగా, జ్యూసీగా ఉండే ఈ దుంప రుచిలో తీపిగా ఉంటుంది. ఈ దుంపను తినడం వల్ల దాహం కూడా వేయదు. శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి శక్తి కూడా అందుతుంది. ఎక్కడైతే తక్కువ ఆహారం పండుతోందో అక్కడే ఈ రామ కండ మూల్  వల్ల ఎక్కువమంది ప్రజలు జీవించగలరు. అందుకే అడవుల్లో అందరూ ఇలాంటి దుంపలను తిని జీవించేవారు.

రామ్ కంద్ మూల్‌లో శోథ నిరోధక లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాతో పోరాడే యాంటీ మైక్రోబయల్ ప్రభావం కూడా ఎక్కువే. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రామ కంద మూల్ తినడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా అడ్డుకుంటాయి. అందుకే ఈ కందమూలం మీకు ఎక్కడ కనిపించినా తినడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా అరుదుగా దొరికే ఆహారం.

ఈ రామ కంద మూల్ దుంపలు నీరు లేని పొడి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పోషక విలువలు, ఔషధ ప్రయోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటికీ గ్రామాల్లో అప్పుడప్పుడు ఈ కందమూలం దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఇప్పటికీ ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువే. నేటి తరానికి దీని పేరు కూడా తెలియదు. ఇలా అంతరించిపోతున్న ఆహారాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తినాలంటే చాలా కష్టం. నగరాల్లో, పట్టణాల్లో ఈ దుంపలు దొరకవు. గ్రామాల్లోకి వెళ్లి వెతుక్కోవాలి. అది కూడా నీరు లేని బంజరు భూముల్లోనే ఇవి పెరుగుతాయి కాబట్టి, అలాంటి ప్రదేశాల్లో వీటిని వెతికితే దొరికే అవకాశం ఉంది.

Related News

Snoring: పెద్దగా గురక వస్తోందా? తేలిగ్గా తీసుకోకండి, అది ఆ ప్రాణాంతక సమస్య వల్ల కావచ్చు

Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

Soda Drinks: సోడాలంటే మీకు ఇష్టమా? ఇక వాటిని మరిచిపోతే మంచిది, లేకుంటే ప్రాణానికి ప్రమాదం కావచ్చు

Quiet Love: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Gun Powder: ఇడ్లీ, దోశెల్లోకి గన్ పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే రెండు నెలలు తాజాగా ఉంటుంది

Night Skincare Routine: రాత్రి పూట ప్రతి రోజు వీటిని ముఖానికి రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

×