EPAPER

Blood Tests : ఏడాదికి ఒక్కసారి ఈ రక్త పరీక్షలు తప్పనిసరి..!

Blood Tests : ఏడాదికి ఒక్కసారి ఈ రక్త పరీక్షలు తప్పనిసరి..!

Every One Must Go For These Blood Tests Annually : ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ప్రాధమిక దశలో గుర్తించడం ముఖ్యం. కానీ ముదిరిపోయాక వాటిని గుర్తిస్తే మాత్రం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ప్రతి ఏడాది కొన్ని రక్త పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి. ఇందులో మీ ఆరోగ్య పరిస్థితి బయటపడుతుంది. అలానే ఏవైనా పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నా ముందుగానే ఈ రక్త పరీక్షలు ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రక్త పరీక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


లిపిడ్ ప్రొఫైల్

లిపిడ్ ప్రొఫైల్ అనేది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకునే రక్త పరీక్ష. దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేయొచ్చు. ఈ పరీక్ష కొలెస్ట్రాల్ ఎంతుందో చెప్పడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్ ఎంతుందో, మంచి కొలెస్ట్రాల్ ఎంతుందో అనేది కూడా నిర్థారిస్తుంది. గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ సంఖ్యను కొలుస్తుంది. ట్రైగ్లిజరైడ్లు పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షించడం ద్వారా వాటి స్థాయిని మందుగానే తెలుసుకోవచ్చు.


Read More : మీరు టీవీ చూస్తూ తింటున్నారా..?

కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC)

కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్ల సంఖ్యను చెప్పే పరీక్ష. ఇది మీ రక్త ఆరోగ్యం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. రక్తహీనత ఇన్ఫెక్షన్ బారిన పడినా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా కూడా ఈ పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తెలుస్తాయి.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (Hb1Ac)

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేసే పరీక్ష. దీన్ని Hb1Ac అని కూడా అంటారు. ఇది ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ వ్యాధులను పరీక్షించడానికి వినియోగిస్తారు. డయాబెటిస్ రావడానికి ముందు దశను ప్రీ డయాబెటిస్ అంటారు. ఈ దశలో ముందే గుర్తిస్తే డయాబెటిక్‌గా మారక ముందే జాగ్రత్త తీసుకోవచ్చు.

Read More : థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..!

రాత్రిపూట ఆహారం తిన్నా తర్వాత 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఉదయం లేచాక Hb1Ac టెస్ట్ చేయించుకోవాలి. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్ష ద్వారా మీ గ్లూకోజ్ స్థాయిలు గత మూడు నెలల్లో ఎలా ఉన్నాయో అంచనా వేయొచ్చు. గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించాలి. ప్రీ డయాబెటిస్ ఉన్న సంగతిని కూడా ఇది ముందేగానే చెబుతోంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే వచ్చే రోగాల నుంచి జాగ్రత్త పడొచ్చు.

థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష

థైరాయిడ్ గ్రంధి పనితీరును అంచనా వేసే పరీక్ష. ఈ గ్రంధి, శక్తి ఉత్పత్తికి, జీవక్రియకు, వివిధ శారీరక విధులను నియంత్రించడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును అంచనా వేయడానికి ఈ పరీక్షను చేయించుకోవాలి. థైరాయిడ్ హార్మోన్లైన T4, T3 స్థాయిలను ఈ పరీక్షల్లో అంచనా వేస్తారు. అవి అధికంగా ఉంటే సమస్యలు ఉన్నట్టే. థైరాయిడ్ పరీక్ష ద్వారా హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం ఉన్నాయో లేవో తేలిపోతుంది.

ప్రహెన్సివ్ మెటబాలిక్ పానెల్ MP పరీక్ష

వివిధ జీవక్రియ పనులను అంచనా వేయడానికి చేసే కర్త పరీక్షను ప్రహెన్సివ్ మెటబాలిక్ పానెల్ (CMP) అంటారు. అంతేకాకుండా అవయవ పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష ఇది. ఈ పరీక్షతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలతో పాటు, ఎలక్ట్రోలైట్స్ అయినా సోడియం, పొటాషియం, క్లోరైడ్ బై కార్బోనేట్ స్థాయిలను కూడా తెలుసుకోవచ్చు. మూత్రపిండాల పనితీరును, కాలేయ పనితీరును, ప్రోటీన్స్ స్థాయిలను కూడా ఇది అంచనా వేస్తుంది.

Disclaimer : ఈ కథనం పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా రూపొందించబడింది.

Related News

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Big Stories

×