EPAPER

Blood Purify Foods: రక్తాన్ని శుద్ధి చేసే.. ఆహార పదార్థాలు ఇవే..

Blood Purify Foods: రక్తాన్ని శుద్ధి చేసే.. ఆహార పదార్థాలు ఇవే..

Blood Purify Foods: మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎన్నో రకాల పనులు చేస్తుంది. ఆక్సిజ‌న్‌, హార్మోన్లను, చ‌క్కెర‌లు, కొవ్వుల‌ను క‌ణాల‌కు ర‌వాణా చేయ‌డంతో పాటు మన రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిత్యం మనం తినే ఆహారంతో పాటు వాతావరణంలో కాలుష్యం, పని ఒత్తిడి వల్ల మన శరీరంలో విష ప‌దార్థాలు పేరుకుపోతాయి.


రక్తం ఈ వ్యర్థాలను తొలగిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివ‌ర్ ర‌క్తాన్ని శుద్ధి చేసేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని ర‌కాల ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఈ ప్రక్రియ మ‌రింత వేగవంతం అవుతుంది. మన బాడీలోని వ్యర్థాలు కూడా సులభంగా బయటికి వెళ్లిపోతాయి.

యాపిల్‌, జామ పండ్లతో పాటు ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే ర‌క్తం శుద్ది అవుతుంది. శ‌రీరంలో ఉండే భార లోహాలు, హానిక‌ర ర‌సాయ‌నాలు, వ్యర్థాలు బ‌య‌ట‌కుపోతాయి. ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ గ్లుట‌థియోన్ వ్యర్థాలు, ర‌సాయ‌నాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. ఆకు కూర‌ల్లో అనేక పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి అనారోగ్యాల‌ను దూరంగా ఉంచుతాయి. పాల‌కూర‌, క్యాబేజీను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫరా మెరుగవుతుంది. శ‌రీరంలోని వ్యర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. బీట్‌రూట్‌లో స‌హ‌జ‌సిద్ధమైన నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. లివ‌ర్ దెబ్బ తిన‌కుండా చూస్తాయి. బీట్‌రూట్ జ్యూస్‌ను ప్రతిరోజు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం స‌హ‌జ‌సిద్దంగా శుభ్రం అవుతుంది. అంతేకాకుండా ర‌క్తం బాగా ఉత్పత్తి అవుతుంది.


బెల్లంలో ఉండే ఫైబ‌ర్ జీర్ణవ్యవ‌స్థను బాగుచేస్తుంది. మ‌ల‌బ‌ద్ధకం రానీయ‌దు. శ‌రీరంలోని వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. బెల్లంలో ఉండే ఐర‌న్ హిమోగ్లోబిన్ స్థాయిల‌ను బాగా పెంచుతుంది. దీంతో ర‌క్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు తగినంత మోతాదులో నీటిని తాగడం వల్ల శ‌రీరంలోని వ్యర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కుపోతాయి. అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది. ప‌సుపును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ర‌క్తం శుభ్రంగా మారుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో స్పూన్‌ నిమ్మర‌సం క‌లిపి తాగితే శ‌రీరంలోని వ్యర్థాలు బయటికిపోతాయి.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×