EPAPER

Betel Leave Benefits: తమలపాకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Betel Leave Benefits: తమలపాకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

 


Betel Leave Benefits: తమలపాకులను సాధారణంగా పూజ, పాన్ లకు ఉపయోగిస్తారని తెలుసు. పాన్ షాపు వద్ద అయితే తమలపాకులు ఎక్కువగా దొరుకుతాయి. అంతేకాదు ఏవైనా పండుగలు వస్తే చాలు దేవుడి పూజలో వాడడానికి తమలపాకులను వాడుతుంటారు. అయితే తమలపాకులతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఛాతిలో కఫం, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా వంటి వాటికి తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తమలపాకులపై కొద్దిగా ఆవనూనె రాసి వేడి చేసి ఛాతిపై ఉంచితే నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు తమలపాకులను నీటిలో ఉడకబెట్టి తినడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మరోవైపు రెండు కప్పుల నీటిలో ఏలకులు, లవంగాలు దాల్చినచెక్క వేసి నీరు మరిగించి దానిని రెండు లేదా మూడురోజులకు ఒకసారి తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: మజ్జిగలో ఉప్పు కలుపి తాగుతున్నారా..?

తలనొప్పిని తగ్గించేందుకు కూడా తమలపాకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదు తమలపాకును పేస్ట్ చేసి గాయాలైన చోట రాయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక తమలపాకులను రసం చేసుకుని కూడా తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల భోజనం తర్వాత తమలపాకును తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. ఇక విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేగుకలు కూడా మేలు చేస్తుంది.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×