EPAPER

Tips For Glowing Skin: గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Tips For Glowing Skin: గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Tips For Glowing Skin: ఏ వయస్సు వారైనా తాము అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలని తహతహలాడుతుంటారు. కానీ సాధారణంగా వయస్సు పెరుగుతున్నా కొద్దీ అందం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. చాలా మంది ముఖం మెరుస్తూ కనిపించడం కోసం రోజు ఎన్నో క్రీములు, కాస్మొటిక్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం సాధారణం. కానీ కొంతవరకు వయస్సు పెరుగుతున్నా కూడా చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉండడానికి కొన్ని టిప్స్ పాటించడం వల్ల యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


తగినంత నీరు:
వయస్సు పెరుగుతున్నా కూడా చర్మం మెరుస్తూ, ముడతలు లేకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు తాగడం అవసరం. ఎక్కువగా నీరు తాగడం వల్ల చర్మకణాలకు తేమ అందుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తగినతం నీరు తాగితే బాడీ హైడ్రేటెడ్‌గా మారి చర్మానికి ఆక్సిజన్ కూడా సరఫరా అవుతుంది. దీంతో ముఖం మృదువుగా కనిపిస్తుంది కాబట్టి రోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

హెల్తీ డైట్:
ఆరోగ్యంగా ఉండడం కోసం శరీరానికి తగిన పోషకాలు తీసుకోవడం అవసరం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తినాలని అంటున్నారు. అవిస గింజలు, అవకాడో, గుడ్ల వంటి పదార్థాలు డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని ద్వారా ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


వీటికి దూరంగా ఉండండి:
సాధారణంగా ఎక్కువమంది పురుషుల్లో మద్యం తాగడం, స్మోకింగ్ చేయడం వంటి అలవాటు ఉంటుంది. దీని వల్ల స్కిన్ పాడవుతుంది. పొగ తాగే వారిలో చర్మం;[ ముడతలు పడే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో వెళ్లడైంది. అందుకే స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఎండ నుంచి రక్షణ:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా స్కార్ఫ్ ఉపయోగించడం మంచిది. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి ఇది ముఖాన్ని రక్షిస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ లేదా సన్ గ్లాసెస్ వంటివి ధరించడం కూడా ముఖ్యమే. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

హైడ్రేటెడ్‌గా ఉంచడం:
చర్మం అందంగా కనిపించడం కోసం మాయిశ్చరైజర్‌ను తప్పకుండా అప్లై చేయాలి. మాయిశ్చరైజర్‌ వల్ల చర్మం ముడతలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

Also Read: శనగపిండితో మృదువైన చర్మం మీ సొంతం !

చాలా మంది అర్థరాత్రి వరకు స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల సరిపడా రాత్రి నిద్రపోవడం లేదు. శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం కూడా అంత మంచిది కాదు. ఫలితంగా చర్మమే కాదు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. దీని వల్ల యవ్వనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శారీరక శ్రమ కలిగించే నడక , పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ఎంతైనా అవసరం. దీని వల్ల శరీరం దృఢంగా ఉండటంతో పాటు గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. శారీరక శ్రమ చేయని వారుయోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల చర్మం ఎల్లప్పుడూ కాంతి వంతంగా కనిపిస్తుంది.

Related News

AI Doctor: నాలుక చూసి రోగం ఏంటో చెప్పేస్తుంది, డాక్టర్ కాదండోయ్ AI టెక్నాలజీ.. ఇదిగో ఇలా గుర్తిస్తుందట!

Homemade Cough Remedies: వీటితో ఇంట్లోనే.. క్షణాల్లో దగ్గు మాయం

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

Pumpkin Juice Benefits: గుమ్మడికాయ జ్యూస్‌తో ఈ సమస్యలన్నీ దూరం

Weight Loss Tips: బరువు తగ్గించే 5 మార్గాల గురించి మీకు తెలుసా ?

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌.. ఇలా అప్లై చేయండి?

Diabetes and Sleep: నిద్రపోయే ముందు అరగంట పాటు ఈ పని చేయడం వల్ల డయాబెటిస్ తగ్గే అవకాశం ఎక్కువ

Big Stories

×