EPAPER

Tips For Skin: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

Tips For Skin: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

Tips For Skin:చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, ముఖం యొక్క గ్లో మెయింటైన్ చేయడానికి చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. గ్లోయింగ్ స్కిన్ కోసం తప్పకుండా కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. చర్మ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా ముఖ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.


స్కిర్ కేర్ కోసం, తరచుగా మార్కెట్లో లభించే స్క్రబ్‌లను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండానే ఇంట్లో కూరగాయలు, పండ్ల తొక్కలను ఉపయోగించి స్క్రబ్‌ లను తయారు చేసుకోవచ్చు.

ఈ స్క్రబ్‌లు చర్మాన్ని సహజసిద్ధంగా శుభ్రం చేయడమే కాకుండా చర్మానికి కొత్త పోషణను అందిస్తాయి. ఇంట్లో తయారుచేసిన ఈ స్క్రబ్‌లు ముఖ రంధ్రాలలోకి చేరి, లోపల నుంచి శుభ్రం చేస్తాయి.


పండ్లు, కూరగాయలతో స్క్రబ్స్..

బంగాళదుంప : బంగాళాదుంప స్క్రబ్ తయారు చేయడానికి ముందుగా 2 బంగాళాదుంపల తొక్క తీసి అందులో 1టీ స్పూన్ కాఫీ పౌడర్ , 1 టీ స్పూన్ పచ్చి పాలు కలిపి స్క్రబ్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ స్క్రబ్ ను ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బంగాళాదుంపతో తయారుచేసిన స్క్రబ్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. దీంతో చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది.

అరటిపండు:
అరటి తొక్క కూడా ఒక అద్భుతమైన స్క్రబ్బర్. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. అరటిపండు తొక్కలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, బి ఉంటుంది. దీన్ని నేరుగా చర్మంపై అప్లై చేస్తే ముఖం మెరుస్తుంది.

Also Read: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

దోసకాయ :
దోసకాయ కూడా ఒక అద్భుతమైన సహజ స్క్రబ్. దాని పై తొక్కను స్క్రబ్‌గా ఉపయోగించండి. ముఖానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు పిగ్మెంటేషన్‌ను ఇది తగ్గిస్తుంది. ఇది చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది.

ఆరెంజ్ :
విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ తొక్కతో తయారు చేసిన స్క్రబ్ ముఖానికి మెరుపును తిరిగి ఇస్తుంది. ఈ స్క్రబ్ చర్మాన్ని తొలగించి చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. నారింజ తొక్కతో తయారుచేసిన స్క్రబ్ కూడా ముఖం యొక్క గ్లోను పెంచడంలో సహాయపడుతుంది.

బొప్పాయి :
బొప్పాయి పొట్టు చాలా మేలు చేస్తుంది. దాని పై ఉండే తొక్క చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయి తొక్కలలో పపైన్ ఉంటుంది. వీటిని ఉపయోగం రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తొక్క స్క్రబ్ మొటిమలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల ముఖం చాలా అందంగా మారుతుంది. ముఖంపై మచ్చలు కూడా తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Amla Oil For Hair: ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Coconut Milk For Skin: కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్.. మీ అందం రెట్టింపు

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

×