Hair fall Control: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్స్‌తో పాటు, ఖరీదైన షాంపూలను వాడకుండా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇదిలా ఉంటే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా, ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే మెంతులు , కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడాల్సిందే. ఇది మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
ఈ రెండూ వెంట్రుకల పెరుగుదలను పెంచడమే కాకుండా జుట్టు రాలకుండా చేస్తాయి. మెంతులు , కరివేపాకులను ఉపయోగించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుండి బలోపేతం చేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు, కరివేపాకుతో హెయిర్ ఆయిల్ తయారీ:
కావలసినవి:
కొబ్బరి నూనె, ఆలివ్ నూనె – 250 గ్రాములుల
మెంతి గింజలు – 3- 4 స్పూన్లు
కరివేపాకు – 1 చిన్న కప్పు
తయారీ విధానం:
మెంతులు, కరివేపాకుతో ఆయిల్ తయారు చేయడానికి, ముందుగా ఒక బాణలిలో కొబ్బరి లేదా ఆలివ్ నూనెను వేసి వేడి చేయండి. దీని తరువాత, వేడి నూనెలో మెంతులు, కరివేపాకులను వేసి మరిగించండి. తర్వాత వాటిని తక్కువ మంట మీద 10-15 నిమిషాలు ఈ ఆయిల్ ఉడికించాలి. దీని తరువాత, గ్యాస్‌ను ఆపేసి, నూనెను చల్లారనివ్వండి. తర్వాత ఆయిల్‌ను వడకట్టి గాజు సీసా లేదా డబ్బాలో నిల్వ చేయండి.
ఎలా ఉపయోగించాలి ?
ఈ నూనెను మీ జుట్టుకు వారానికి రెండుసార్లు రాయండి. రాత్రి ఆయల్‌ను హెయిర్‌కి అప్లై చేసి ఉదయాన్నే షాంపూతో వాష్ చేసుకోండి.రెగ్యులర్‌గా మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడితే కొన్ని వారాల్లోనే మీ జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.
Also Read: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు
మెంతులు, కరివేపాకు యొక్క ప్రయోజనాలు:
మెంతులు, కరివేపాకుతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
వీటితో తయారు చేసిన నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడంతోపాటు జుట్టు రాలడం తగ్గుతుంది.
మెంతులు, కరివేపాకుతో తయారు చేసిన నూనె జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె కాకుండా, మీరు బాదం నూనె లేదా ఆముదం కూడా ఈ నూనె తయారు చేయడంలో ఉపయోగించవచ్చు.
మీరు ఈ నూనెలో అలోవెరా జెల్ , విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.