EPAPER
Kirrak Couples Episode 1

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !

Homemade Hair oil: ప్రస్తుతం జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ తో పాటు షాంపూలను వాడుతున్నారు. కానీ వీటిని వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.


ఇదిలా ఉంటే వీటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. అందుకే ఇలాంటి ఖరీదైన ఆయిల్స్ వాడకుండా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం అలవాటు చేసుకోండి. వీటి వల్ల జుట్టు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఆయిల్ తయారీకి కావాల్సినవి:
కొబ్బరి నూనె – 500 గ్రాములు
కరివేపాకు – 5 నుండి 6 రెమ్మలు
తరిగిన ఉల్లిపాయలు – 2
కలోంజి విత్తనాలు – 50 గ్రాములు
కలబంద – 50 గ్రాములు
మెంతి గింజలు – 100 గ్రాములు


తయారీ విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో 500 గ్రాముల కొబ్బరి నూనె వేసి సన్నని మంటపై ఉంచండి. ఆ తర్వాత పైన చెప్పిన మోతాదుల్లో కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు కలోంజి , మెంతులు, కలబందను వేసి10 -15 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ ని చల్లారనివ్వాలి. అనంతరం ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి.

Also Read: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

వారానికి రెండుసార్లు ఈ నూనెను మీ జుట్టు, కుదుళ్లకు సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఈ ఆయిల్ తరుచుగా వాడితే 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. జుట్టు బలంగా, మందంగా, పొడవుగా మారుతుంది. జుట్టు రాలడం కూడా క్రమంగా తగ్గిపోయి తెల్లజుట్టు సమస్య దూరమవుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Coffee Benefits: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

Chili Garlic Chicken Fry: వెల్లులి కారంతో కోడి వేపుడు.. తినే కొద్దీ తినాలనిపిస్తుంది..

Olive Oil: ఆలివ్ ఆయిల్ అంత ఖరీదు ఎందుకు? ఆరోగ్యానికి అంత మంచిదా?

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Big Stories

×