EPAPER

Homemade Hair Mask: మీ జుట్టును ఒత్తుగా మార్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే !

Homemade Hair Mask: మీ జుట్టును ఒత్తుగా మార్చే..  బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే !

Homemade Hair Mask: మనమందరం ఆరోగ్యకరమైన, దృఢమైన, మెరిసే జుట్టును కలిగి ఉండాలని కోరుకుంటాం. కానీఈ రోజుల్లో కాలుష్యం,ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జుట్టు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్యను చాలా మంది ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలు, కండీషనర్లను ఉపయోగిస్తున్నారు.


ఇలాంటివి ఏమీ వాడకుండానే ఇంట్లో ఉండే వస్తువులతో మీ జుట్టును స్ట్రాంగ్‌గా, షైనీగా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లు మీ జుట్టుకు సహజమైన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. మెరిసే, దృఢమైన జుట్టు కోసం హోం మేడ్ హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం .

ఎగ్ హెయిర్ మాస్క్:
గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గుడ్డును ఒక బౌల్‌లో వేసి గిలక్కొట్టి మీ జుట్టుకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. వీలైతే షాంపూ కూడా వాడవచ్చు. వారానికి ఒకసారి ఈ మాస్క్ ఉపయోగించండి.


అరటి పండుతో హెయిర్ మాస్క్:
అరటిపండు జుట్టుకు పోషణను అందించడంతో పాటు తేమను అందిస్తుంది. బాగా అరటిపండును మెత్తగా చేసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టును మృదువుగా,మెరిసేలా చేస్తుంది.

తేనె, నిమ్మకాయతో హెయిర్ మాస్క్:
తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది . నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం ఒక బౌల్ లో వేసి మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది.

పెరుగుతో హెయిర్ మాస్క్:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, బలంగా చేస్తుంది జుట్టుకు ఒక కప్పు పెరుగును అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ మాస్క్ చుండ్రు నుండి జుట్టుకు ఉపశమనం అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది.

ఉసిరి కాయ పొడితో హెయిర్ మాస్క్ :
ఉసిరికాయలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. 3- 4 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

కొబ్బరి నీటితో హెయిర్ మాస్క్:

కొబ్బరి నీరు జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా పొడిబారకుండా కాపాడుతుంది. కొబ్బరి నీళ్లను మీ జుట్టుకు పట్టించి, కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. తరుచుగా ఇలా చేయడం ద్వారా మీ జుట్టు మందంగా మారుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి.

Also Read: ఉల్లిపాయతో ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు రాలనే రాలదు

హెయిర్ మాస్క్ వేసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

హెయిర్ మాస్క్ వేసుకునే ముందు, మీ జుట్టును పూర్తిగా తడిగా చేయండి.

జుట్టు యొక్క మూలాల నుండి చివర్ల వరకు మాస్క్‌ను సమానంగా అప్లై చేయండి.

హెయిర్ మాస్క్ ను 20-30 నిమిషాలు ఉంచండి. తద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది.

చల్లటి నీటితో మాత్రమే హెయిర్ మాస్క్ వాష్ చేయాలి.

ఈ హెయిర్ మాస్క్‌లను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించండి.

Related News

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!

Chia Seeds Hair Mask: చియా సీడ్స్‌తో హెయిర్ మాస్క్.. ఒక్క సారి వాడారంటే రిజల్ట్ పక్కా

Black Pan Cleaning Tips: వంటిట్లో వాడే గిన్నెలు నల్లగా మారాయా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్

Big Stories

×