EPAPER

Foods For Over 40s: ఇక ఆ వయస్సుకు వచ్చేశారా ? ఈ ఫుడ్ తినాల్సిందే మరి !

Foods For Over 40s: ఇక ఆ వయస్సుకు వచ్చేశారా ? ఈ ఫుడ్ తినాల్సిందే మరి !

Foods For Over 40s: వయస్సు పెరిగే కొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


వయస్సు పెరిగే కొద్ది శరీరం బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎటాక్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీ వయసు పైబడిన తరువాత కూడా శరీరానికి అందుతున్న పోషకాలపై శ్రద్ధ వహించడం అవసరం. 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైలీ డైట్‌లో పోషకాలున్న ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు:


శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకుకూరలు తీసుకోవడం తప్పనిసరి. 40 ఏళ్ల తర్వాత కూడా ఆకుకూరలు తప్పనిసరిగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుకూరల్లో ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడతాయి, కూరలు, చట్నీల రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పప్పు:
40 ఏళ్లు దాటిన తర్వాత కూడా మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన మరో ఆహారం పప్పు ధాన్యాలు. శనగపప్పు, మినపప్పు ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో వండిన వంటకాలు తీనడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు అందుతాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

గుడ్లు:
40 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో ఉడికించిన గుడ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ విటమిన్ డి, బయోటిన్, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండాలి. కాబట్టి కండరాల శక్తి కోల్పోకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు:
40 సంవత్సరాల తర్వాత కూడా శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే తప్పనిసరిగా యాంటీ ఆక్సిడెంట్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు. డార్క్ చాక్లెట్లు, బ్లూ బెర్రీస్ వంటి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి క్యాన్సర్ తగ్గించేందుకు కారణమవుతాయి.

Also Read: పుచ్చగింజలు పడేస్తున్నారా ? పోషకాలు తెలిస్తే షాక్ అవుతారు

పాల ఉత్పత్తులు:
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పెరుగు, మజ్జిగ వంటి పాల సంబంధిత ఆహార పదార్థాలు జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ తేలిక చేస్తాయి. ప్రతి ఒక్కరు 40 ఏళ్ల తర్వాత డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×