EPAPER

Tips For Silky Hair: మీ జుట్టు సిల్కీగా మారిపోవాలా ? అయితే ఇవి వాడండి

Tips For Silky Hair: మీ జుట్టు సిల్కీగా మారిపోవాలా ? అయితే ఇవి వాడండి

Tips For Silky Hair:  జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే.. ఆరోగ్యంగా, మెరిసేలా కనిపిస్తుంది. కానీ జుట్టును నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులపై ఖర్చు చేయడానికి బదులుగా, మీరు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడవచ్చు. బరువు తగ్గడానికి సాధారణంగా ఉపయోగించే చియా గింజలు జుట్టు సంరక్షణలో కూడా చాలా మేలు చేస్తాయి.


చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా చుండ్రును కూడా తగ్గిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

హెయిర్ మాస్క్లను ఎలా తయారు చేయాలి ?


1. చియా సీడ్స్, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్: 
కావలసినవి:
చియా విత్తనాలు – 2 టీస్పూన్లు
కొబ్బరి నూనె – 4 టీస్పూన్లు
తేనె – 1 టీస్పూన్
ఆపిల్ సైడర్ వెనిగర్ – కొద్దిగా
నీరు – తగినంత

తయారీ విధానం :
చియా గింజలను ఒక గిన్నెలో తీసుకుని నీటిలో అరగంట నానబెట్టాలి. నానబెట్టిన చియా గింజలను కొబ్బరి నూనె, తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ తో కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేసుకోండి.

ఈ హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు..

చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి . అంతే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. ఇందులో వాడిన కొబ్బరి నూనె జుట్టుకు లోతుగా తేమను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును పొడిబారకుండా చేస్తుంది. తేనె జుట్టును మెరిసేలా చేస్తుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టు యొక్క pH ని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా జుట్టును బలపరుస్తుంది.

2. చియా సీడ్స్, అలోవెరా హెయిర్ మాస్క్:

కావలసినవి:
చియా విత్తనాలు- 1 కప్పు
అలోవెరా జెల్- అవసరం మేరకు
నీరు- తగినంత

తయారీ విధానం: చియా గింజలను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని తక్కువ మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మిశ్రమం చిక్కగా మారినప్పుడు, గ్యాస్ పై నుంచి దించి చల్లబరచండి. చల్లారిన తర్వాత అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత మీ జుట్టును నీటితో శుభ్రం చేసుకోండి.

Also Read: ఈ గింజలు కొన్ని చాలు.. మీ చుండ్రును పూర్తిగా తగ్గించడానికి !

ఈ హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు..
చియా గింజలు, అలోవెరా జెల్ రెండూ జుట్టుకు తేమను అందిస్తాయి. అంతే కాకుండా ఈ హెయిర్ మాస్క్ జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది.
ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. అలోవెరా జెల్‌లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Big Stories

×