EPAPER

Upset Stomach: కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఏ ఆహారం తినాలి ? ఏవి తినకూడదు ?

Upset Stomach: కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఏ ఆహారం తినాలి ? ఏవి తినకూడదు ?

Upset Stomach: కడుపు నొప్పి అనేది ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యే. కానీ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడేవారు కూడా చాలా మందే ఉంటారు. అలాంటప్పుడు వారు తినే ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. కడుపు నొప్పి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది.


ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, వికారం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, లేదా అతిసారం వంటి సమస్యలు ఎదుర్కునే వారు తినే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం:
కడుపులో నొప్పితో పాటు వికారం, వాంతుల వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే వికారం నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది. వారికే కాదు ఎవరైన అజీర్ణం సమస్యను ఎదుర్కుంటున్నప్పుడు అల్లం ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీన్ని పచ్చిగా తిన్నా లేక వంటల్లో వేసుకున్నా కూడా కడుపు నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.


చమోలీ:
చమోలీ కడుపు నొప్పిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కడుపులోని అసౌకర్యం, వాంతులు, ఇబ్బందుల నుంచి ఇది రక్షిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో అరుగుదల, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

అవిసె గింజలు:
ప్రేగు కదలికలను నియంత్రించడంలో అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. కడుపునొప్పి, మలబద్ధకాన్ని తగ్గించే శక్తి వీటికి ఉంది. కాబట్టి అజీర్ణం, వికారం, వాంతులతో బాధపడుతున్న వారు వీటిని తినడం మంచిది.

బొప్పాయి:
పాపైన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి అజీర్తి సమస్యలని దూరం చేస్తుంది.

అరటిపండ్లు:
అరటి పండ్లలో సహజ సిద్ధంగా యాంటీ యాసిడ్స్ ఉంటాయి. కడుపులో శ్లేష్మం ఉత్పత్తిని పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చికాకును నివారించడంలో, విరేచనాలను తగ్గించడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: బ్లాక్ కాఫీతో 30 రోజుల్లోనే వెయిట్ లాస్.. ఎలానో తెలుసా ?

ప్రోబయోటిక్స్:
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి వాటిని నయం చేసి పేగుల కదలికను నియంత్రిస్తాయి. పెరుగు, మజ్జిగ లాంటివి ఇందుకు ఎంతో ఉపయోగపడతాయి.

కడుపు నొప్పి వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు..

  • డైరీ పదార్థాలు
  • కెఫిన్
  • సిట్రస్ పండ్లు
  • మసాలా ఆహారాలు
  • అధిక ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×