EPAPER

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Best Foods for Hair Growth and Thickness: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఏ యయసు వారికైన అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.  అందాన్ని మరింత రెట్టింపు చేసేది మాత్రం జుట్టే.. రకరకాల హెయిర్ స్టైల్స్‌తో అందంగా కనిపించవచ్చు. కానీ ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలే సమస్య  ప్రతి ఒక్కరికి సాధారణంగా మారింది. దీనికి కారణం కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు, జీవన శైలిలో మార్పులు. ఒత్తిడి ఇతర కారణాలు కావచ్చు. వీటి వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు ఎక్కవ అవుతున్నాయి. కాబట్టి మనం తినే ఆహారంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామ చేయడం కూడా చాలా అవసరం. మీ డైట్‌లో ఈ ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యల నుండి బయటపడవచ్చు. మరి జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారపదార్ధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


గుడ్లు
కోడి గుడ్లలో ప్రొటీన్స్, ఐరన్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అందిస్తాయి. ప్రతి రోజు గుడ్డు తినడం వల్ల శరీర ఆరోగ్యానికే కాదు.. జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి రోజు డైట్‌లో కోడి గుడ్డును తినండి.

అల్లం
అల్లంలో జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలు అధికంగా ఉంటాయి. అల్లం తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ప్రతిరోజు వేడి నీళ్లల్లో చిన్న అల్లం ముక్క వేసి ఆ నీటిని తాగండి. మంచి ఫలితం ఉంటుంది.


ఆకు కూరలు
ఆకు కూరల్లో యాంటీ ఆక్సీడెంట్లు, విటమిన్ సి, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అందిస్తాయి. జుట్టుకు బలం, మెరుపును అందిస్తాయి.

Also Read:  కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

అవిసె గింజలు
అవిసె గింజలు జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ ఇ, ఒమెగాస్, వంటి పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికే కాదు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

బాదం
బాదంలో అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు నాలుగు, ఐదు బాదం పప్పులు తినండి.

కరివేపాకు
జుట్టు పెరుగుదలకు కరివేపాకు అద్బుతంగా పనిచేస్తుంది. వీటిలో విటిమిన్ బి, సి, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సెల్యులార్ పునరుత్పత్తికి సహాయపడతాయి. అంతేకాదు స్కాల్ఫ్‌పై రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు కరివేపాకును తినండి. ఆరోగ్యానికి మంచిది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Papad History: కరకరలాడే అప్పడాలు ఈనాటివి కాదు, వేల ఏళ్ల నుంచి మనం తింటూనే ఉన్నాం

Biryani Cooking Tips: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే బిర్యానీ వండుకుని తినాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Big Stories

×