EPAPER

Eye Care Tips: కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Eye Care Tips: కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Eye Care Tips: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెబుతుంటారు. శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే కంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పరిస్థితులు రావొద్దని అనుకుంటే కళ్లద్దాలు రాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. నేచురల్ టిప్స్ ఫాలో అయితే కంటే ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భవిష్యత్తులో కళ్లద్దాలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జీవన శైలి :
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం కంటే ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. డైలీ డైట్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండే ఆహార పదార్థాలు తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి కూడా ఇది ఎంతో అవసరం. శరీరానికి తగినంత నీరు కూడా తాగాలి. అంతే కాకుండా వ్యాయామం కూడా ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది.

స్క్రీన్ సమయాన్ని తగ్గించడం:
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని స్క్రీన్ సమయాన్ని తగ్గించడం. ఎందుకంటే డిజిటల్ పరికరాల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. వీటిపై ఉంటే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌టైమ్ రోజు రెండు గంటల పరిమితం చేయడం వల్ల కంటి అలసట, దృష్టి, ఒత్తిడి తగ్గించడంలో బాగా సహాయపడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.


సరైన లెన్స్:
కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించే వారు ఆరోగ్యంగా ఉండడానికి కరెక్ట్ లెన్స్ లను ఉపయోగించడం అవసరం. వీటిని నిర్దేశించిన విధంగా ధరించడం కూడా అవసరం. సరైన లెన్సులు వాడకపోతే కూడా కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రెగ్యులర్ కంటి పరీక్షలు:
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. తరుచూ కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల కంటి సమస్యలను ప్రారంభంలోనే తెలుసుకోవచ్చు .అంతే కాకుండా యూవీ కిరణాల నుంచి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాణ్యత గల సన్‌గ్లాసెస్‌ను కూడా తీసుకోవడం మంచిది.

వీటీకి దూరంగా ఉండాలి:
కాఫీ, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన కోకో పదార్థాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటిని వీలైనంత దూరంగా ఉండడం మంచిది. పానీయాలు, స్వీట్లు కూడా తక్కువగా తీసుకోవాలి.

Also Read: ఇంటికి అందాన్ని.. మనకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే !

20-20-20:
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల విరామం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ రూల్ పాటించడం వల్ల కంటి ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. గంటల తరబడి స్క్రీన్ మీద గడిపేవారు రెప్ప వేయడం తదేకంగా చూడడం వంటి కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీటి వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×