EPAPER

Drinks For Weight Loss: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్స్ ఇవే !

Drinks For Weight Loss: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్స్ ఇవే !

Drinks For Weight Loss: అధిక బరువు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో నానా అవస్థలు పడుతున్నారు. స్థూలకాయం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. బరువు పెరగడానికి మారిన జీవన శైలి కూడా ఒక కారణం. ఇదిలా ఉంటే కొందరు పెరిగిన బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.


కొందరు జిమ్‌లకు వెళ్లి వర్కౌట్స్ చేస్తుంటే మరి కొందరు పక్కా డైట్ ఫాలో అవుతుంటారు. కానీ కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. మరి బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్‌గా పని చేసే డ్రింక్స్ తయారీ, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగ: బరువు తగ్గాలని అనుకునే వారు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అవసరం. మజ్జిగలో కూడా తక్కువ క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోటీన్లు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తాయి. అంతే కాకుండా మజ్జిగలో పొటాషియంతో పాటు సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను కూడా శరీరానికి అందిస్తాయి. మజ్జిగలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఫుడ్ తినాలని అనిపించదు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి.


దోసకాయ నీరు: దోసకాయలో తక్కువ మోతాదులో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి దోసకాయ నీరు బాగా పని చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారు రోజు దోసకాయ వాటర్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలను రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జీలకర్ర వాటర్ : అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీటిలో వేసుకుని.. ఉదయం లేచిన వెంటనే ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జీలకర్రలో ఉండే కెటోన్స్ అనే సమ్మేళనాలు కొవ్వును కరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల ఆహారం కూడా జీర్ణం అవుతుంది. జీలకర్ర నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉండేలా చేస్తాయి.

Also Read: ఉదయం పూట నిమ్మరసం తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా ?

బార్లీ వాటర్: బరువు తగ్గాలని అనుకునే వారికి బార్లీ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కప్పు బార్లీ గింజలను నాలుగు కప్పుల వాటర్ వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఈ నీరు చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని తాగాలి. రోజు ఈ నీటిని తాగటం వల్ల చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతే కాకుండా కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడానికి ఇది  ఎంతో ఉపయోగపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×