EPAPER

Glowing Skin Diet: అందం కోసం ఏవేవో వాడకండి.. ఎంచక్కా ఈ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి

Glowing Skin Diet: అందం కోసం ఏవేవో వాడకండి.. ఎంచక్కా ఈ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి

Glowing Skin Diet: అందమైన మెరిసే చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మెరిసే చర్మాన్ని పొందాలంటే దానిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం కాలుష్యం, జంక్ ఫుడ్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతే కాకుండా చర్మంపై మొటిమలు రావడంతో పాటు చర్మం పాలిపోయినట్లు తయారవుతుంది. కాంతిహీనంగా కూడా మారుతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.


ఖరీదైన ఉత్పత్తుల వాడటం వల్ల ఉపయోగం ఉండటం లేదా.. మీరు చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మ పొందాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంపై కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. మీరు తినే ఫుడ్ లో కొన్ని రకాల పదార్థాలను చేర్చడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఎన్ని క్రీములు రాసుకున్నా ఫేషియల్స్ చేయించుకున్నా చర్మం సహజసిద్ధంగా మెరవదు. చర్మం లోపలినుంచి ఆరోగ్యంగా ఉండాలంటే పక్కా డైట్ ఫాలో అవ్వాల్సిందే. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు:
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల లోపాలు రాకుండా ఉంటాయి. ఇవి హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాంతివంతమైన చర్మం కోసం ఆహారంలో ఆకుకూరలు చేర్చడం చాలా అవసరం. ఇది ముఖానికి మంచి మెరుపును అందిస్తుంది.
తగినంత నీరు:
ముఖానికి ఎంత ఖరీదైన క్రీములు అప్లై చేసినా ముఖంపై మెరుపు రాదు. సరైన మోతాదులో నీరు తాగితే ముఖం మెరుస్తుంది. మీరు రోజంతా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతే కాకుండా టాక్సిన్స్ శరీరం నుంచి బయటకు వస్తాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
నిమ్మ రసం, కలబంద:
నిమ్మ రసం, కలబంద రసం వంటివి తాగడం వల్ల చర్మం మెరిసిపోతుంది. లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. కలబంద రసం తాగడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పండ్లు:
మెరిసే చర్మం కోసం పండ్లను డైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. పండ్లలో ఉండే విటమిన్లు అనేక పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి. దీనితో పాటు ఆహారంలో సలాడ్‌లను ఖచ్చితంగా చేర్చుకోండి. కీరా, దోసకాయ, క్యారెట్, టమోటా, క్యాబేజీ, బీట్‌రూట్‌లను సలాడ్‌లో వాడటం మంచిది. వీటన్నింటిలో అనేక విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి ప్రయోజనం కలుగుతుంది.
పెరుగు:
రోజు కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల కూడా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. బయట నుంచి ఇంటికి వచ్చాక వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. జిడ్డు ముఖంపై అలాగే ఉంటే ముఖంపై మొటిమలు రావడానికి అవకాశం ఉంటుంది.

Also Read: నెయ్యిని ఇలా తింటే 30 రోజుల్లోనే బరువు తగ్గొచ్చు తెలుసా ?


పర్ఫెక్ట్ సమయం అవసరం:
గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే డైలీ రొటీన్‌ సకాలంలో ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం నిర్ణీత సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం మంచిది. సరైన సమయంలో లంచ్ కూడా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు,పెరుగు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. బయట జంక్ ఫుడ్ తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినేందుకు ప్రయత్నించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×