EPAPER

Rice Water For Skin: బియ్యం కడిగిన నీళ్ళను పారబోస్తున్నారా ? ఇది తెలిస్తే అస్సలు ఆ పని చెయ్యరు..

Rice Water For Skin: బియ్యం కడిగిన నీళ్ళను పారబోస్తున్నారా ? ఇది తెలిస్తే అస్సలు ఆ పని చెయ్యరు..

Rice Water For Skin: అందగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందు కోసం రకరకాల ప్రొడక్ట్స్,హోం రెమెడీస్ కూడా వాడుతుంటారు. హోం రెమెడీస్ ప్రభావవంతంగా పని చేస్తుంటాయి. అంతే కాకుండా సైట్ ఎఫెక్ట్ కూడా ఉండవు. అందంగా కనిపించడానికి మన ఇంట్లో ఉండే పదార్ధాలను వాడవచ్చు. అందులో ఒకటి బియ్యం కడిగిన నీరు. ఇది అత్యంత ప్రయోజనకరమైన పదార్థం. దీన్ని వివిధ సౌందర్య చికిత్సలకు కూడా ఉపయోగిస్తుంటారు.


ముఖ్యంగా ఆసియా దేశంలో చర్మానికి బియ్యం నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. బియ్యం నీటిని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ నీరు చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మ కణాలను ఉత్తేజపరుస్తుంది. బియ్యం నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ముఖానికి రైస్ వాటర్‌‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీరు పారబోసే ముందు అందులో ఎన్ని ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోండి.
చర్మం కాంతివంతం:
బియ్యం నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇవి చర్మంలోని మృత కణాలను కూడా తొలగిస్తాయి. కొత్త కణాల పెరుగుదలకు ఎంతగానో ప్రోత్సహిస్తాయి. బియ్యం నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి తాజాదనాన్ని ఇస్తాయి. అంతే కాకుండా చర్మం నుంచి దుమ్ము, మృత కణాలను తొలగిస్తుంది. చర్మంపై మొటిమలు రాకుండా చేస్తుంది.


పోషణ అందిస్తుంది:
బియ్యం నీటిలో ఉండే పోషకాలు చర్మానికి పోషణనిస్తాయి .ఇది చర్మ కణాలను బలోపేతం చేసి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. ఇది చర్మానికి సరైన పోషకాలు అందించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మొటిమలు మాయం:
రైస్‌ వాటర్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను చాలా వరకు తగ్గిస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది.
మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది:
బియ్యం కడిగిన నీటిని చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది. అంతే కాకుండా చర్మం పొడిబారకుండా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. రైస్ వాటర్ వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.

Also Read: జుట్టు బాగా పెరగాలా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

చర్మంపై బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి..
టోనర్‌గా ఉపయోగించవచ్చు:
బియ్యం నీటిని స్కిన్ టోనర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. స్కిన్ ను‌ చల్లబరచడానికి ఒక కప్పు బియ్యం నీటిని ఫ్రిజ్‌లో ఉంచండి. ప్రతి రోజు ఉదయం, రాత్రి కాటన్ బాల్‌తో చర్మంపై దీనిని అప్లై చేయండి.
ఫేస్ మాస్క్‌లాగా ఉపయోగించండి:
బియ్యం నీటిలో కొంత శెనగపిండి, పసుపు కలపండి. దీంతో తయారు చేసిన పేస్ట్‌ను చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లని నీటితో కడిగేయండి. దీంతో ముఖం మిళమిళ మెరిసి పోతుంది.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×