EPAPER

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Henna Hair Oil: ప్రతి అమ్మాయి జుట్టు పొడవుగా, అందంగా, ఆకర్షనీయంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విపరీతంగా జుట్టు రాలిపోవడం. అలాగా చుండ్రు వంటి సమస్యలు ఎక్కువ అవడం. దీనికి ప్రధాన కారణం స్ట్రెస్, పొల్యూషన్, సరైనా ఆహారం తీసుకోకపోవడం, వివిధ కారణాలు కావచ్చు. జుట్టు పెరగటం కోసం బయట మార్కెట్లో వివిద రకాల ఆయిల్స్‌ని ట్రై చేస్తుంటారు. కానీ ఫలితం ఏమి కనిపించదు. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంటి పెరట్లో దొరికే గోరింటాకుతో హెయిర్ ఆయిల్ ట్రై చేశారంటే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది. గోరింటాకులో జుట్టు సంరక్షణకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దశాబ్ధకాలం నాటి నుంచే గోరింటాకును జుట్టుకు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా గోరింటాకును తెల్ల జుట్టు నివారణకు ఉపయోగిస్తుంటారు. గోరింటాకు జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని జుట్టుకు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా ఓసారి ఈ హెయిర్ ఆయిల్‌ని ఉపయోగించండి. మంచి ఫలితం ఉంటుంది.


హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన పదార్ధాలు..

కొబ్బరి నూనె పావు కప్పు
గోరింటాకు పావు కప్పు
మెంతలు మూడు టేబుల్ స్పూన్‌లు


హెయిర్ ఆయల్ తయారు చేసుకునే విధానం
ముందుగా గోరింటాకులను శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్‌లో వేయాలి. ఇలా చేయడం వల్ల తడిని పీల్చేస్తుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె, మెంతులు, గోరింటాకు వేయాలి. గ్యాస్ మంట లో ఫేమ్‌లో పెట్టుకుని వాటిని మిక్స్ చేస్తూ బాగా మరిగించాలి. ఈ ఆయిల్‌ని నెలకు సరిపడ చేసుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఆయిల్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లార్చి వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అంతే సింపుల్ గోరింటాకుతో హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే.. ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ను వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేయొచ్చు. కుదుళ్ల నుంచి చివర్లకు వరకు ఈ ఆయిల్ అప్లై చేసి.. రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.. రెండు, మూడు గంటల తర్వాత ఘాటు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఈ గోరింటాకు నూనెతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తెల్ల జుట్టు కూడా రాదు.

ఈ ఆయిల్ వడకట్టిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని పడేయొద్దు. ఇవి జుట్టుకు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ఈ ఆకులను మిక్సీ జార్‌లో వేసి అందులో ఐదు మందారం ఆకులు, పువ్వులు, రెండు టేబుల్ స్పూన్ పెరుగు, కలబంద వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

గోరింటాకు ఉపయోగాలు..
గోరింటాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్లు, ప్రొటీన్లు, అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అలాగే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా సహాయం చేస్తుంది.

మెంతులు ఉపయోగాలు..
మెంతుల్లో కూడా జట్టు పెరుగుదలకు కావాల్సిన లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాదు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా సహాయపడుతుంది.ఈ హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు అప్లై చేశారంటే.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Related News

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!

Big Stories

×