EPAPER

Hair Growth Tips: జుట్టు రాలుతోందా.. చుండ్రు సమస్యలా.. అయితే ఉసిరిని ఇలా ఉపయోగించండి..

Hair Growth Tips: జుట్టు రాలుతోందా.. చుండ్రు సమస్యలా.. అయితే ఉసిరిని ఇలా ఉపయోగించండి..

Benefits of Amla for Stronger And Thicker Hair: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. దీనికి కారణం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చుండ్రు సమస్యలు రావడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఈ సమస్యల నుండి బయటపడేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే  బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ వాటిని ఉపయోగించిన వలన ఫలితం ఉంటుందో లేదో తెలియదు. పైగా వాటి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యల నుండి బయట పడాలంటే ఉసిరి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..


ఉసిరిలో విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్లు, అనేక ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉసిరిని ఉపయోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అలాగే జుట్టు దృఢంగా మారుతుంది.

అనేక కారణాల వల్ల జుట్టు రంగుని కోల్పోతుంది. పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి సమస్య వలన జుట్టు రంగు మారుతుంది. అయితే ఉసిరిని ఇలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. బృంగరాజ్ నూనెలో ఆమ్లా పొడిని వేసి జుట్టుకి అప్లై చేస్తే  జుట్టు రంగు మారుతుంది. అలాగే గోరింటాకుతో  ఉసిరి పొడిని కలిపి జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు రంగు మారుతుంది. అలాగే ఒత్తుగా పెరుగుతుంది కూడా..


Also Read: బీట్ రూట్‌ను అదే పనిగా తింటున్నారా.. దీని వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్..

ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే.. గూస్బెర్రీ పొడితో పాటు ఉసిరి పొడిని నీటిలో కలిపి జుట్టుకి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

చుండ్రు రావడానికి ప్రధాన కారణం.. స్కాల్ప్ పొడిగా మారటమే.. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఉసిరి వాడండి. ఎందుకంటే స్కాల్ప్ కి ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తద్వార చుండ్రు సమస్య తొలగిపోతుంది.

 

Tags

Related News

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

×