EPAPER

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ లో అనేక పోషకాలు ఉంటాయి. దీని వినియోగం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని బాగా పెంచుతుంది. ఇది శరీరంలో రక్తహీనత ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బీట్‌రూట్ రసం తాగడం వల్ల కూడా గుండెకు చాలా మంచిది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


బీట్‌రూట్ అధిక పీచుపదార్థం కలిగిన ఆహారం. బీట్‌రూట్ తీసుకోవడం జీర్ణ సమస్యలతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బీట్‌రూట్ రసం తాగడం వల్ల కలిగే 5 పెద్ద ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ రసం తాగడం వల్ల 5 ప్రయోజనాలు..


గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
బీట్‌రూట్‌లో నైట్రేట్స్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

రక్తహీనతను నివారిస్తుంది:
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
బీట్‌రూట్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా ఇన్‌ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

శక్తి స్థాయిలను పెంచుతుంది:
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌లు రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి. తద్వారా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.

బీట్‌రూట్ రసం ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
బీట్‌రూట్- (2-3)
నీరు – గ్లాసు
నిమ్మరసం – ఒక చిన్న ముక్క
ఉప్పు – రుచి ప్రకారం
ఐస్ క్యూబ్‌లు – అవసరం ప్రకారం

Also Read: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

బీట్‌రూట్ రసం తయారుచేసే విధానం..

ముందుగా బీట్‌రూట్‌ను బాగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన బీట్‌రూట్ ముక్కలను మిక్సర్ జార్‌లో వేయండి. ఆ తర్వాత దానిలో కొంచెం నీరు కలపండి. ఇలా మాక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన రసంలో రుచి ప్రకారం ఉప్పు, నిమ్మరసం జోడించండి. చల్లటి జ్యూస్ తాగాలనుకుంటే, దానికి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి .కావాలంటే ఈ రసాన్ని క్యారెట్, యాపిల్, ఇతర పండ్లతో కూడా కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Work Pressure: పని ఒత్తిడి.. చివరకు ఆత్మహత్యలకు కారణమవుతుందా..?

Headache: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Curry Leaves: కరివేపాకు గురించిన 5 ఆశ్చర్యకర విషయాలు

Big Stories

×