EPAPER

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

Beetroot Face Pack: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం అనేక రకాల ఫేస్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అలాంటి వారు రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడకుండా బీట్ రూట్‌తో ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మాన్ని మెరిసేలా చేసే గుణాలు బీట్‌రూట్‌లో ఉన్నాయి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.


మన ఇంటి వంటగదిలో ఉండే పదార్థాలు కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాదు.. వివిధ రకాల మసాలాలు, పండ్లు, కూరగాయలు అందాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి కోవకు చెందిందే బీట్ రూట్ కూడా. మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి బీట్‌రూట్‌ను కూడా ఉపయోగించవచ్చు. బీట్‌రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డిటాక్సిఫికేషన్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని ఫేస్ ప్యాక్ లా వాడితే స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను దూరం  అవుతుంది.

ఇదే కాకుండా, బీట్‌రూట్ చర్మంలో ఉన్న కొల్లాజెన్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.


ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీట్ రూట్ ఫేస్ ప్యాక్ ను మీరు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే 3 సులభమైన ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్ :
మీ చర్మం చాలా డల్‌గా ఉంటే, ఈ హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా 2 బీట్‌రూట్‌లను తొక్క తీసి ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టి ఆపై రసాన్ని తీయండి. దీనిలో దానికి 2 స్పూన్ల అలోవెరా జెల్ వేసి పేస్ట్ లాగా చేయండి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

2. మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్:

మీరు పార్టీకి వెళ్లే సమయంలో పార్లర్ కు వెళ్లడానికి సమయం ఉండదు. ఇలాంటి సమయంలో చర్మంపై తక్షణ కాంతిని పొందాలనుకుంటే, ఈ బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా అవసరం అవుతుంది. దీనిని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ముందుగా 2 బీట్‌రూట్‌ ముక్కలను తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ తర్వాత దానిలోనే కాస్త ఆరెంజ్ తొక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత దీనిని కడిగేయాలి. దీంతో మీ ముఖం మెరిసిపోవడం ప్రారంభమవుతుంది.

Alos Read: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

3. ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ ప్యాక్:
కాలుష్యం కారణంగా మీ ముఖంపై చర్మం చాలా డల్‌గా మారినట్లయితే, బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి. ఇది అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో 2-3 చెంచాల పెరుగు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ బీట్ రూట్ పేస్ట్ వేయండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి.
తర్వాత ఈ ప్యాక్‌ను మీ ముఖంపై 10-15 నిమిషాల పాటు ఉంచండి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయండి. బీట్‌రూట్ , పెరుగు ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించడంలో బాగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. వీటిని తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Wife and Husband: మీ జీవిత భాగస్వామి మీకు అబద్ధం చెబుతున్నా, మోసం చేస్తున్నా తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ టిప్స్ పాటించండి

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

×