EPAPER

Beauty Tips: మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందా? వీకెండ్‌లో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

Beauty Tips: మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందా? వీకెండ్‌లో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.

Beauty Tips Weekend Homemade face Pack For Glowing Skin: రోజూ ఆఫీస్ నుంచి, ఏదైనా పనిమీద బయటికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి మీ ఫేస్ డల్‌గా కనిపిస్తుందా. మీ ముఖం మెరుపు తగ్గిపోతుందా? అయితే ఈ ఫేస్ ప్యాక్‌లు ఓసారి ట్రై చేయండి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చర్మానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే మీరు అందంగా ఉండటానికి, యవ్వనంగా ఉండేందుకు సాధ్యమవుతుంది. ఇందుకోసం సరైన పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడి నుండి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. వారాంతాల్లో క్రమం తప్పకుండా ఫేస్ ప్యాక్ లాంటివి ట్రై చేయాలి. అప్పుడే నిత్యం మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. డల్‌గా కూడా కనిపించదు. ఇలా అని బయట డబ్బులు పెట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే నాచురల్ ప్రొడక్ట్స్ తోనే ఫేస్ ప్యాక్ ట్రై చెయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


డెడ్ స్కిన్‌ని ఇలా శుభ్రం చేసుకోండి.
2-4 టీస్పూన్‌ల పచ్చిపాలను తీసుకుని అందులో చిటెకెడు ఉప్పు కలపండి. వాటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమంతో ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా ఐదు నిమిషాల పాటు ముఖాన్ని పాలతో మసాజ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ముఖంపై మురికిని తొలగిస్తుంది. మచ్చలు కూడా తొలగిపోతాయి.

ఇంట్లోనే మినీ ఫేషియల్ చేసుకోండిలా..
మినీ ఫేషియల్ స్కిన్ ఎక్స్ పోలియేట్ చేయడం ద్వారా ముఖంపై మట్టిని తొలగించవచ్చు. ఇందుకోసం నాలుగు టేబుల్ స్పూన్లు శెనగపిండి తీసుకుని అందుతో టీ స్పూన్ తేనె, రోజ్ వాటర్ కలిపి వాటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు అలానే ఉంచి.. సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే  ఉత్తమ ఫలితం ఉంటుంది.


Also Read: కాళ్ళకీ, చేతులకి వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఈ పనులు చేయకండి, చర్మం నల్లగా మారిపోతుంది

ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్
ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ లేదా గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

టోనర్
మార్కెట్లో దొరికే టోనర్‌తో ముఖంపై అప్లై చెయొచ్చు. లేదంటే దోసకాయ రసంలో చిటెకెడు తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయండి. మరుసటి రోజు ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే మీ చర్మం మృదువుగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×