EPAPER

Cholesterol Control Tips: ఈ ఆయుర్వేదిక చిట్కాతో.. 30 రోజుల్లోనే శరీరంలోని కొలెస్ట్రాల్ మాయం!

Cholesterol Control Tips: ఈ ఆయుర్వేదిక చిట్కాతో.. 30 రోజుల్లోనే శరీరంలోని కొలెస్ట్రాల్ మాయం!

Cholesterol Control Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఉండేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆయుర్వేద వైద్యం అనేది ఒక పురాతన వైద్య విధానం. వేదాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. కాకపోతే త్వరిత గతిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను పొందాలన్న ఆశతో ఎక్కువ మంది అల్లోపతి వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. అల్లోపతితో పోలిస్తే ఆయుర్వేదానికి సంబంధించిన ఏ మందులు తీసుకున్నా సరే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా వస్తాయి.


ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా ఒక సింపుల్ చిట్కా ఉంది. భోజనానికి ముందు ప్రతిరోజు ఒక స్పూన్ అల్లం పొడిలో చిటికెడు రాతి ఉప్పును వేసి కలుపుకుని తింటే ఎంతో మంచిది. లేదా దానిని నీటిలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. భోజనానికి ముందు ఇది తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గించడంతో పాటు మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

రాతి ఉప్పు అంటే శుద్ధి చేయని ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అల్లంలో కూడా ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను కూడా తగ్గిస్తాయి. అల్లంలో జింజరాల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.


అల్లం రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రాతి ఉప్పులోని ముఖ్యమైన ఖనిజాలతో కలిస్తే కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కాబట్టి రాతి ఉప్పు, అల్లం పొడిని వేసి ప్రతి రోజు భోజనానికి ముందు తినడం అలవాటు చేసుకోండి. ఇలా తినడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు కాస్త గోరు వెచ్చని నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అల్లం, రాతి ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో గ్యాస్ట్రిక్ ఏర్పడడం తగ్గుతుంది. జీర్ణక్రియ లక్షణాలు కూడా బాగా మెరుగుపడతాయి.

Also Read: పావురాలతో ప్రాణాలకే ముప్పు.. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే !

జీర్ణ రసాలు కూడా ఉత్పత్తి అవుతాయి. పొట్టలోని ఆమ్లాలు అన్నీ సమతుల్యం అవుతాయి. ఇది పోషకాలను బాగా గ్రహిస్తుంది. ప్రతి భోజనానికి 15 నిమిషాల ముందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం పొడి, చిటికెడు రాతిపొడి వేసి బాగా కలుపుకుని ఆ నీటిని తాగేయాలి. ఇలా తాగిన 20 నిమిషాల తర్వాత భోజనాన్ని తినాలి. ఇలా చేస్తే 30 రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×