EPAPER
Kirrak Couples Episode 1

Tea and Biscuits: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

Tea and Biscuits: ఇప్పటివరకు తిన్నది చాలు, ఇకపై టీ తాగుతూ బిస్కెట్లు తినడం మానేయండి, అది మీకే ప్రమాదం

Tea and Biscuits: టీ, బిస్కెట్ల జోడి చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఉదయం లేదా సాయంత్రం టీ తాగుతూ మధ్య మధ్యలో బిస్కెట్లను కరకరలాడిస్తూ ఉంటారు. నిజానికి టీ బిస్కెట్లు రెండూ మంచి కాంబినేషన్ కాదు. అయినా సరే వాటిని తినేవారి సంఖ్య కోట్లలో ఉంది. టీ తాగుతున్నప్పుడు బిస్కెట్లను ఎందుకు తినకూడదో తెలుసుకోండి.


బిస్కెట్లను ఎందుకు తినకూడదు?

బిస్కెట్లను శుద్ధి చేసిన పిండి, శుద్ధి చేసిన చక్కెరతో తయారుచేస్తారు. వాటిని తిన్న తర్వాత రక్తంలో చక్కర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేస్తుంది. అలాగే బరువు పెరగడానికి కూడా దోహదపడుతుంది. శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. మీరు తాగే టీలో ఉన్న పంచదార, ఈ బిస్కెట్లు కలిపి మీ ఆరోగ్యాన్ని చెడగొడతాయి. కాబట్టి టీ తాగేటప్పుడు బిస్కెట్లు తినడం పూర్తిగా మానేయండి.


బిస్కెట్లను మైదా,చక్కెరతో ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీటిలో జీరో క్యాలరీలు ఉంటాయి. అంటే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు ఏమీ ఉండవు. టీతో పాటు బిస్కెట్లను తినడం వల్ల ఆకలి తీర్చడం మాట పక్కన ఉంచితే, ఆ తరువాత అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మీరు బరువు త్వరగా పెరిగిపోతారు.

బయట దొరికే బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అలాగే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇవి HDL స్థాయిలను తగ్గించి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తాయి. దీనివల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. చెడు కొవ్వులు శరీరంలో చేరకుండా ఉండాలంటే బిస్కెట్లను తినడం తగ్గించాలి.

Also Read: లవంగాలతో మతిపోయే లాభాలు!

ఎసిడిటీ

టీ లో టానిన్లు ఉంటాయి. ఇవి పొట్టలోని చేరాక ఆమ్లతను పెంచుతాయి. దీనివల్ల ఎసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బిస్కెట్లలో ఉండే చక్కెర, శుద్ధి చేసిన పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు… యాసిడ్ రిఫ్లెక్స్ ను, కడుపుబ్బరాన్ని, అజీర్ణాన్ని పెంచుతాయి. కాబట్టి టీలు, బిస్కెట్లు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తాయి.

టీ ఎక్కువగా తాగే వారిలో ఐరన్, క్యాల్షియం వంటి పోషకాల శోషణ తగ్గిపోతుంది. టీలో క్యాల్షియం, ఐరన్‌లను బంధించే టానిన్లు ఉంటాయి. దీనివల్ల శరీరం ఐరన్, క్యాల్షియం గ్రహించలేదు. ఇది కొన్నాళ్ళకి ఐరన్ లోపంగా లేదా కాల్షియం లోపంగా మారిపోతుంది. ఇక చక్కెర అధికంగా ఉండే బిస్కెట్లతో పాటు టీ తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.

టీతో పాటు బిస్కెట్లు తినే అలవాటు ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒక స్నాక్స్ తినే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అధికంగా అలా ఆహారాన్ని తిని ఊబకాయం బారిన పడతారు. చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది.

నోటి సమస్యలు

కొన్ని బిస్కెట్లు నోటిలో చేరాకా దంతాలకు అతుక్కుని ఉండిపోతాయి. టీ లోను పంచదార ఉంటుంది. ఆ పంచదార కంటెంట్ కూడా దంతాలపై చేరి దంత క్షయానికి కారణం అవుతుంది. ఈ పరిస్థితి కావిటీస్, చిగుళ్ల వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి మీకు టీతో బిస్కెట్లు తినే అలవాటు ఉంటే ఈ రోజు నుంచే మానేయండి. లేదా టీ లేదా బిస్కెట్లు ఏదో ఒకటే తినండి. రెండూ కలిపి తినకండి.

 

Related News

Tomato Juice: టమాటా రసం తాగితే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Vitamin E Capsules: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో మీ అందం రెట్టింపు

Vitamin deficiency: మీకు విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే, వీటిని తినండి

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Cloves Health Benefits: లవంగాలతో మతిపోయే లాభాలు!

Big Stories

×