EPAPER

Clove for Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? ఓ సారి మన లవంగాలను ట్రై చేయండి

Clove for Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? ఓ సారి మన లవంగాలను ట్రై చేయండి

Clove for Weight Loss: ప్రతి వంటకంలో కొన్ని పదార్థాలను ముఖ్యంగా వాడుతుంటారు. అందులోను కారం, ఘాటు, మసాలాలు ఉండాలి అనుకునే పదార్థాలలో లవంగం ప్రత్యేకంగా ఉంటుంది. దాని సువాసన, రుచి ఏకంగా వంటకాన్నే మార్చేస్తుంది. అంతేకాదు మసాలా దినుసులను పూర్వకాలంలో చికిత్సకు కూడా ఉపయోగించేవారట. ఆయుర్వేదం, సబ్బులు వంటి వాటిల్లోను ఇప్పటికీ మసాలా దినుసులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.


మసాలా దినుసుల్లో లవంగాలకు ఉండే ప్రత్యేక వేరు. లవంగాలు, వాటి పొడి లేకుండా ఏ వంటకం కూడా అంత రుచిగా అనిపించదు. అయితే వంటకాల్లో ఉపయోగించే లవంగాల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లవంగాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇందులో ఉండే పోషకాలతో అనేక వ్యాధులను నివారించవచ్చని అంటున్నారు. అంతేకాదు లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెంపొందించుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో బాధపడే వారికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలతో నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, దంతాలు కూడా బలంగా ఉంటాయి. ఎటువంటి సమస్యలు అయినా తగ్గించుకోవచ్చు.


Also Read: Cleaning Teeth Techniques: రోజు సరిగా బ్రష్ చేయకపోతే ఏం అవుతుందో తెలుసా..?

లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు వీటితో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయట. వెయిట్ లాస్ కోసం లవంగాలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు లేదా మూడు లవంగాలు నానబెట్టి వాటిని ఉదయం తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు వీటి పొడిని కూడా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం, లేదా లవంగాలతో టీ తయారు చేసుకుని తాగినా కూడా ప్రయోజనం ఉంటుంది.

Related News

Homemade Rose Water: ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Worst First Date: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

Zepto: మహిళకు ఐ-పిల్ పేరుతో అలాంటి మెసేజ్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

Strange News: అతడికి ‘మూడు’.. ఆశ్చర్యపోతున్న వైద్యులు, ఇన్ని రోజులు ఎలా దాచుకున్నావయ్యా?

Tips For Men: అబ్బాయిలూ.. ‘పడక గది’లో చతికిల పడుతున్నారా? ఈ ఫుడ్స్‌కు కాస్త దూరంగా ఉండండి బాస్!

Big Stories

×