EPAPER

Beauty tips: చేపలు తింటే మొటిమలు రావా? ఇదిగో ఇలా చేస్తే.. అందం మీ సొంతం

Beauty tips: చేపలు తింటే మొటిమలు రావా? ఇదిగో ఇలా చేస్తే.. అందం మీ సొంతం

Beauty tips: టీనేజిలో ఎక్కువగా కనిపించే సమస్య మొటిమలు. కొందరికి టీనేజీ వయసు దాటినా కూడా మొటిమలు వస్తూనే ఉంటాయి. నిత్యం చెంపలపై మొటిమలు ఉండడం వల్ల అంత అందంగా కనిపించరు. అంతేకాదు ఆ మొటిమలు గుంతలకు కూడా కారణం అవుతాయి. కాబట్టి వీటిని ప్రాథమిక దశలోనే తగ్గించుకోవాలి.


మొటిమలు రాకూడదంటే..

మొటిమలు రాకుండా ఉండాలంటే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఒమేగాత్రీ కొవ్వు ఆమ్లాలు చేపలలో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డైన్ వంటి చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా మొటిమలు సమస్యను తగ్గించుకోవచ్చు.


ఒమేగా 3తోనే సాధ్యం

ఒక అధ్యయనం ప్రకారం మొటిమల బారిన పడిన వారిలో 98% మందిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాల మోతాదు చాలా తక్కువగా ఉన్నట్టు కనిపించింది. ఎప్పుడైతే ఈ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయో మొటిమలు వచ్చే సమస్య కూడా తగ్గుతుంది. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారం తినడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చర్మ ఆరోగ్యం, అందం పెరుగుతుంది.

Also Read: చుండ్రు సమస్య వేధిస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే రిజల్ట్స్​ పక్కా​!

మొటిమలకు కారణం అదే

శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా రాకుండా ఉంటుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటే ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎలాంటి ఆహారాల్లో అధికంగా ఉంటాయో… వాటిని ఎంపిక చేసుకొని తినడం మొదలు పెట్టండి. చేపలతో పాటు మరికొన్ని ఆహారాల్లో కూడా ఈ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా లభిస్తాయి.

ఇవి కూడా తీసుకోండి

ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను కూడా తినడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా మొటిమలు రాకుండా అడ్డుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

వీటిలో ఒమెగా 3 ఎక్కువ

చేపలు, నట్స్ అంటే బాదం, వాల్ నట్స్, జీడిపప్పులు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వీటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తినేందుకు ప్రయత్నించండి. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

Also Read: జుట్టు సమస్యలన్నింటికీ ఈ హెయిర్ మాస్క్‌తో చెక్ !

ఆలీవ్ నూనె కూడా..

ఆలివ్ నూనె కూడా చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో చేసిన ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. సలాడ్లపై ఆలివ్ నూనె వేసుకొని తినండి. తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచని ఆహారాలే చర్మానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి చేపలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తింటే ఎంతో మంచిది. సో.. చూశారుగా, ఇకపై మొటిమలు వేదిస్తే.. ఇవన్నీ ప్రయత్నించండి.

గమనిక: వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×