EPAPER

Drinking Too Much Water: పరగడుపున నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? ఏం అవుతుందో తెలుసా

Drinking Too Much Water: పరగడుపున నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? ఏం అవుతుందో తెలుసా

Drinking Too Much Water: శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. ఆహారం కంటే ఎక్కువగా ప్రతీ రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వందల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నీటిని రోజూ తాగడం మంచిదే అయినా కొంత మంది ఎలా తీసుకోవాలో తెలియకుండా ఉదయం పరిగడుపునే ఎక్కువ నీటిని తాగేస్తుంటారు. పరగడుపున నీటిని తాగడం మంచిదే అయినా కూడా ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పళ్లు తోముకోవగానే నీటిని తాగాలి.


నీటిని తాగడం మంచిదే అయినా కూడా పరగడుపున ఎక్కువ నీటిని తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయం అయినా రాత్రి అయినా కూడా తగిన మోతాదులో మాత్రమే నీటిని తీసుకోవాలి. లేకపోతే కడుపు సంబంధింత సమస్యలు ఎదురవుతా యి. ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. అంతేకాదు కిడ్నీలపై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. మరోవైపు జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

పరగడుపున నీరు ఎక్కువగా తాగడం వల్ల కలిగే సమస్యలు ఇవే..


1. జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం

పరగడుపున ఎక్కువ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

2. కిడ్నీలపై ఒత్తిడి

కిడ్నీలు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి. అందువల్ల అవసరానికి మించి నీరు తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరిగి సక్రమంగా పని చేయలేక భవిష్యత్తులో కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు.

3. హైపోనాట్రేమియా

ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిని తగ్గి హైపోనాట్రేమియా వంటి సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాంతులు, కండరాల తిమ్మిరి, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడి ప్రాణాలకే ప్రమాదం తీసుకువస్తుంది.

4. ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత

శరీరం ఎలక్ట్రోలైట్ల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందనే విషయం తెలిసిందే. శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ ముఖ్యమైన విధుల్లో సహాయపడే ఖనిజాలు. అందువల్ల ఎక్కువ నీరు తాగితే సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా బలహీనత, అలసట, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.

ఇలా చేస్తే సమస్యలు ఉండవు..

1. గోరువెచ్చని నీళ్లు :

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

2. నెమ్మదిగా త్రాగడం:

ఒకే సారి ఎక్కువ నీరు త్రాగడం వంటివి చేయకూడదు. దాహంగా ఉన్నా కూడా నీటిని నెమ్మదిగా త్రాగాలి.

3. అవసరాలు తీర్చుకోవడం:

ప్రతీ రోజూ శరీరానికి అవసరం అయిన నీటిని తప్పక తీసుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ నీరు, అవసరానికి మించి తక్కువ నీటిని అస్సలు తీసుకోకూడదు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×