Amla Benefits: ఉసిరి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయను తరుచుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి రూపంలో అయినా, జ్యూస్ రూపంలో అయినా తినవచ్చు. ఏ రూపంలో తిన్నా దాని పోషకాలు తగ్గవు. ఉసిరిలో ఉండే సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఉసిరికాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా జుట్టు, చర్మ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఉసిరికాయ తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరికాయ తినడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఉసిరికాయ తినడం వల్ల 5 ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి బూస్టర్: ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. తరుచుగా వ్యాధుల బారిన పడే వారు ఉసిరిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమైనది: ఆమ్లా జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
చర్మానికి మేలు చేస్తుంది: ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యంగా , మెరుస్తూ కనిపించేలా ఉంటాయి. ఇది మచ్చలు, ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఉసిరిని తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.
కంటికి మంచిది: ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కంటిశుక్లం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. కంటి సమస్యలు ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
జుట్టుకు మేలు చేస్తుంది: ఆమ్లా జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది జుట్టు నల్లగా, మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఉసిరికాయను ఎలా తీసుకోవాలి ?
ఉసిరి రసం: రోజు ఉసిరికాయ రసం తాగడం ఉత్తమ మార్గం.
ఉసిరి పొడి: ఉసిరి పొడిని పెరుగు లేదా నీళ్లలో కలిపి తీసుకోవచ్చు.
ఉసిరికాయ పచ్చడి: ఉసిరికాయ పచ్చడిని కూడా తినవచ్చు.