EPAPER

Patika Bellam: వేడివేడి పాలలో పటిక బెల్లం కలుపుని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Patika Bellam: వేడివేడి పాలలో పటిక బెల్లం కలుపుని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Patika Bellam: పటిక బెల్లం పంచదారను ప్రాసెస్ చేయడం ద్వారా తయారవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పటిక బెల్లం సాధారణంగా గుడిలో ప్రసాదంగా అమ్ముతుంటారు. ఏ ఇంట్లో అయినా కూడా పంచదారను మాత్రమే ఉపయోగిస్తుంటారు. పంచదార లేకుండా పాలు, టీ, కాఫీ దేనిని తీసుకోలేరు. అయితే పంచదారను క్రిస్టల్ రూపంలోకి మార్చితే పటిక బెల్లం తయారవుతుంది. ఇలా తయారైన పటిక బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది పంచదార కంటే ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఇస్తుంది. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


పటికబెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, అమినో ఆమ్లాలు, ఖనిజాలు ఉంటాయి. మాంసాహారాల్లో ఉండే ముఖ్యమైన విటమిన్లు పటిక బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి మాంసాహారం తీసుకుంటే అందే పోషకాలు అన్నీ పటిక బెల్లం వల్ల అందుతాయి. పటిక బెల్లం తినడం వల్ల శరీరంలో శక్తిని పెంచుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే పటిక బెల్లాన్ని చాలా రకాలుగా తీసుకోవచ్చు.

పటికబెల్లంను వేడివేడి పాల ద్వారా తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వేడివేడి పాలలో రెండు లేదా మూడు పటిక బెల్లంను తీసుకుని తరచూ మూడు పూటలు తీసుకోవాలి. వర్షాకాలంలో గొంతు సమస్యలు ఉన్న వారు ఇలా తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు పటిక బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.


నీటిలో పటిక బెల్లం పొడిని కలుపుకుని తాగడం వల్ల దాహం కూడా తీర్చుకోవచ్చు. ఎండాకాలంలో వేడి చేసి ముక్కులో నుంచి రక్తం వస్తే ఆ సమయంలో పటిక బెల్లంను తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. పటిక బెల్లంలో ఉండే ఐరన్ రక్త హీనతను తగ్గిస్తుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో దీనిని తీసుకుంటే సమస్యలను తగ్గించుకోవచ్చు.

పటిక బెల్లంను నీటిలో నానబెట్టుకుని గంధాన్ని కలిపి దానిని తేలు వంటి కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల విషం పోతుంది. జీర్ణక్రియ సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా పటిక బెల్లం తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×