EPAPER

Potato Biryani: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

Potato Biryani: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే ఆటూ బిర్యాని చేస్తే పావుగంటలో రెడీ అయిపోతుంది. ఈ బిర్యాని తినేందుకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మాంసాహారం ముట్టని వారు ఆలూ బిర్యానీ ప్రయత్నించండి. దీన్ని చేయడం చాలా సులువు. లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఆలూ బిర్యాని కచ్చితంగా నచ్చుతుంది.


ఆటూ బిర్యానీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
నూనె – సరిపడినంత
నెయ్యి – ఒక స్పూను
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – ఆరు రెబ్బలు
మిరియాలు – ఒక స్పూను
జీలకర్ర – అర స్పూను
ఉల్లిపాయలు – రెండు
టమాటా – ఒకటి
లవంగాలు – మూడు
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
అనాసపువ్వు – ఒకటి
పచ్చి బఠానీలు – ఒక కప్పు
బంగాళదుంప – రెండు
నీరు – సరిపడినంత
గరం మసాలా – అర స్పూను
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ఆలూ బిర్యానీ రెసిపీ
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ పావుగంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి వేయాలి.
4. అందులోనే యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి.
5. ఆ తర్వాత సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
6. ఆ తరువాత టమోటోలు, బఠానీలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.
7. పైన మూత పెట్టి వీటిని ఉడికిస్తే అవి దగ్గరగా ఇగురు లాగా ఉడుకుతాయి.
8. ఆ తర్వాత ఒక కప్పు నీరు వేసి కలుపుకోవాలి.
9. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా కూడా వేసుకోవాలి.
10. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి.
11. పైన సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీరను వేసుకోవాలి.
12. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. అంతే టేస్టీ బంగాళదుంప బిర్యానీ రెడీ అయిపోతుంది.
13. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నింటినీ రెడీ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లోనే ఇది ఉడికిపోతుంది.


Also Read: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

శాకాహారులకు ఈ బిర్యానీ చాలా నచ్చుతుంది. ఇక శ్రావణమాసంలో మాంసాహారం ముట్టని వారు ఇలా బంగాళదుంప బిర్యానిని చేసుకొని తినవచ్చు. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. బంగాళదుంప బిర్యానిని ఒకసారి మీరు ఇంట్లో ప్రయత్నించి చూడండి.

Related News

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Home Remedies For Hair: బియ్యం నీటితో జుట్టు పొడవాటి జుట్టు

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Big Stories

×