EPAPER

Almond For Skin: బాదంను ఇలా వాడితే.. మీ ముఖం మెరిసి పోతుంది

Almond For Skin: బాదంను ఇలా వాడితే.. మీ ముఖం మెరిసి పోతుంది

Almond For Skin: బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బాదం చర్మ సంరక్షణలో కూడా విరివిగా ఉపయోగించబడుతుంది. బాదంపప్పులో ఉండే పోషకాలు చర్మంపై ముడతలను తొలగించడమే కాకుండా మృదువుగా, మెరిసేలా, ఆరోగ్యవంతంగా చేస్తాయి.


వృద్ధాప్యంలో వచ్చే యాంటీ ఏజింగ్ కోసం బాదంను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీ ముఖం మెరుపును కోల్పోతుందని మీరు ఆందోళన చెందుతుంటే కనక మీరు బాదంపప్పును 3 విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది మీ ముఖం యొక్క పాత గ్లోను తిరిగి పొందడంలో సహాయపడుతుంది.

బాదంపప్పుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ కూడా ముఖం కాంతిని పెంచడంలో ఉపయోగపడుతుంది. బాదం చర్మ సంరక్షణకు ఒక అద్భుతమైన నేచురల్ రెమెడీ. ఇందులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి తగిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.


బాదంపప్పుతో చర్మ సంరక్షణ ఎలా ?

ఆల్మండ్ ఆయిల్:
బాదం నూనె చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. చర్మంపై మంటలను తగ్గిస్తుంది. బాదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ప్రతి రోజు బాదం నూనెను ముఖానికి, మెడకు అప్లై చేసుకోవచ్చు.

బాదం పౌడర్:
బాదం పౌడర్ ఒక సహజమైన స్క్రబ్. ఇది చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగించి మెరిసేలా చేస్తుంది. బాదం పొడి, తేనె, పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ముఖం అందంగా మారుతుంది.

బాదం పాలు:
బాదం పాలు చర్మానికి పోషణను అందిస్తాయి. బాదం పాలను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. మీరు ప్రతిరోజు బాదం పాలు తాగడం ద్వారా మీ చర్మానికి పోషణను అందించవచ్చు.  తరుచుగా బాదం పాలు తాగడం వల్ల  చర్మం  అందంగా మెరుస్తుంది.

1.ఆల్మండ్ ఆయిల్, హనీ ఫేస్ ప్యాక్:
2 టీస్పూన్ల బాదం నూనె, 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులోని ఆల్మండ్ ఆయిల్ , తేనె ఫేస్ ప్యాక్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మంపై మంటను తగ్గిస్తుంది.

Also Read:  వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

2. ఆల్మండ్ ఆయిల్, పసుపు ఫేస్ ప్యాక్:
బాదం నూనె, పసుపు ఫేస్ ప్యాక్ చర్మాన్ని మొటిమల నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 2 టీస్పూన్ల బాదం నూనె, 1/2 టీస్పూన్ పసుపు , 1 టీస్పూన్ చందనం పొడిని కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది.

Related News

Homemade Face Mask: ఖరీదైన క్రీములు అవసరమే లేదు.. వీటితో ఇన్స్టంట్ గ్లో

Orange Juice: ఈ జ్యూస్ తాగితే అనేక వ్యాధులు పరార్.. బరువు కూడా తగ్గొచ్చు

Herbal Hair Oil: ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో.. జుట్టు పెరగడం గ్యారంటీ

Curry Leaves Hair Mask: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Big Stories

×