EPAPER

Health tips: స్నానం చేసే నీళ్లలో ఒక్కసారి ఇది కలిపి చేయండి.. ఇక అస్సలు వదలలేరు..

Health tips: స్నానం చేసే నీళ్లలో ఒక్కసారి ఇది కలిపి చేయండి.. ఇక అస్సలు వదలలేరు..

Health tips: చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తుంటారు. అంతేకాదు ముఖ సౌందర్యం కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే చర్మ కాంతికోసం ఆహారం ఎంత అవసరమో స్నానం చేయడం కూడా అంతే అవసరం. సాధారణంగా నీటిని పోసుకుని సబ్బు రాసుకుని స్నానం చేస్తే మాత్రమే శరీరంపై మురికి పోయి శుభ్రంగా అవుతుందని అనుకుంటారు. అయితే శరీరాన్ని వాడే సబ్బుతో మాత్రమే కాంతివంతంగా మార్చుకోవచ్చని నమ్ముతారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.


ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల శరీరం పరిశుభ్రంగా మారుతుంది. అంతేకాదు మానసికంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు స్నానం చేసే సమయంలో కేవలం సబ్బు మాత్రమే కాకుండా ఉప్పును కూడా వాడితే శరీరం కాంతివంతంగా మారుతుంది. స్నానం చేసే సమయంలో ఆ నీటిలో ఉప్పును కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉప్పులో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఉప్పును కాసింత నీటిలో కలుపుకుని స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచే కాదు చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి కూడా తోడ్పడుతుంది.

ఉప్పులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీనిని ఔషధల్లో కూడా ఉపయోగిస్తారు. ఉప్పును స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల శరీరంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు ఇందులో ఉండే ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మృదువుగా మారి చర్మం నునుపుగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉప్పు నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ ఉప్పు నీటితో స్నానం చేస్తే ముఖంపై ముడతలు కూడా తొలగిపోతాయి.


ఉప్పు నీటితో చేయి, కాళ్ల వేళ్ల మధ్య పేరుకుపోయిన మురికిని తొలగించి మృదువుగా మార్చేలా చేస్తుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా చర్మానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరోవైపు ఉప్పు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×