EPAPER

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Stem Cells Reverse Woman’s Diabetes: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా  ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. భారత్ తో పాటు ఇతర దేశాలనూ డయాబెటిస్ తీవ్రంగా వేధిస్తున్నది. రానున్న కాలంలో ఈ సమస్యతో ప్రపంచంలోని సగం మందికిపైగా బాధపడే అవకాశం ఉన్నట్లు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నిర్మూలన కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా చైనా పరిశోధకులు టైప్ 1 డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు సరికొత్త చికిత్స విధానాన్ని కనిపెట్టారు.


స్టెమ్ సెల్ ట్రాన్స్‌ ప్లాంట్ తో డయాబెటిస్ కంట్రోల్

స్టెమ్ సెల్ ట్రాన్స్‌ ప్లాంట్ పద్దతి ద్వారా టైప్ 1 డయాబెటిస్ ను పూర్తిగా అదుపు చేసినట్లు చైనీస్ పరిశోధకులు వెల్లడించారు. ఈ విధానాన్ని ఉపయోగించి గత 20 ఏళ్లుగా టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్న మహిళకు క్యూర్ చేశారు. ఈ పద్దతి ద్వారా రోగిలోని కొన్ని కణాలను తీసుకుంటారు. ల్యాబ్ లో ఆ కణాలకు కొన్ని రసాయన మార్పులు చేస్తారు. మూల కణాలను రిపేర్ చేస్తారు. తిరిగి అవే కణాలను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఇవి ఇన్సూలిన్ ఉత్పత్తిని పెంచి టైప్ 1 డయాబెటిస్ ను అదుపు చేస్తాయి. ఈ చికిత్స చేసిన సుమారు 75 రోజుల తర్వాత సదరు మహిళ ఇన్సూలిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం పూర్తిగా మానేసినట్లు పరిశోధకులు తెలిపారు. పూర్తిగా టైప్ 1 డయాబెటిస్ కంట్రోల్ అయినట్లు వెల్లడించారు.


ఇప్పటి వరకు చికిత్స ఎలా ఉండేదంటే?

ప్రస్తుతం టైప్ 1 డయాబెటిస్ ను అదుపు చేసేందుకు, చనిపోయిన వ్యక్తి ప్యాంక్రియాసిన్ నుంచి ఐలెట్ కణాలను తీసుకుని తీసుకుంటారు. వాటిని టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తి కాలేయంలోకి ప్రవేశపెడతారు. ప్యాంక్రియాస్ లోని ఐలెట్ సెల్స్ ఇన్సులిన్, గ్లూకాగాన్ లాంటి హార్మోన్లను రిలీజ్ చేస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేయడంలో సాయపడుతాయి. అయితే, ఐలెట్ కణాలను దానం చేసే వాళ్లు లేకపోవడం వల్ల ఈ చికిత్స అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది.

 టైప్1, టైప్ 2 డయాబెటిస్ మధ్య తేడా ఏంటి?

మానవ శరీరంలో గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి సరిపడ ఇన్సూలిన్ ఉత్పత్తి కాకపోవడాన్ని డయాబెటిస్ అంటారు. ఆ సమయంలో బాడీలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. శరీరంలో గ్లూకోజ్ పెరగడం వల్ల అన్ని అవయవాలపై ప్రభావం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా అవయవాలు దెబ్బతింటాయి. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. టైప్1, టైప్ 2. టైప్ 2 డయాబెటిస్ అనేది క్రమ పద్దతి లేని జీవన శైలికారణంగా వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పటి వరకు డయాబెటిస్ కు పూర్తి స్థాయి చికిత్స అనేది సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు ఇన్సూలిన్ ను బయటి నుంచి ఇవ్వడం ద్వారా గ్లూకోజ్ ను కంట్రోల్ చేస్తున్నారు. తాజాగా చైనా పరిశోధకులు కనిపెట్టిన స్టెమ్ సెల్ ట్రాన్స్‌ ప్లాంటేషన్ ద్వారా టైప్ 1 డయాబెటిస్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే అవకాశం ఉంది.

Read Also: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Related News

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Heart Disease: మహిళలకు గుండె జబ్బులు తక్కువ వస్తాయి ?.. ఎందుకో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Dandruff: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Eyelash: ఆకర్షణీయమైన కనురెప్పల కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Rock Salt: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు

Health Tips: ఈ 5 అలవాట్లతో అనారోగ్య సమస్యలు రావు

Big Stories

×