EPAPER

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Cancer in Men: మగవారికి మాత్రమే వచ్చే క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. ఇది ప్రొస్టేట్ గ్రంథిలో అభివృద్ధి చెందే క్యాన్సర్. ఆ గ్రంథిలో కణాలు అసాధారణంగా పెరిగి, ఒక చోట కుప్పగా మారుతాయి. అది క్యాన్సర్ కణితిగా మారిపోతుంది. మగవారిలో ప్రొస్టేట్ గ్రంధి వాల్‌నట్ ఆకారంలో ఉంటుంది. ఇది స్పెర్మ్‌ను రవాణా చేసే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే మరో 15 ఏళ్లలో మన దేశంలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే పురుషుల సంఖ్య పెరగనుందని కొత్త అధ్యయనం తేల్చింది.


2040 నాటికి.. మరింత ప్రమాదం

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ చెబుతున్న ప్రకారం ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో అత్యధికంగా వస్తున్న క్యాన్సర్లలో రెండో స్థానంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో నాలుగవ స్థానంలో ఉంది. లాన్సెంట్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం 2020లో 1.4 మిలియన్ల మంది ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2040నాటికి ఈ సంఖ్య 2.9 మిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులో పెరుగుదలను నిరోధించలేమని కూడా నివేదిక చెబుతోంది. ఎందుకంటే మగవారి జీవనశైలి తీవ్రంగా మారిపోయింది. వారు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తే తప్ప ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడం చాలా కష్టం.


ఈ వయస్సు వాళ్లలోనే ఎక్కువ..

ప్రొస్టేట్ క్యాన్సర్ ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన మగవారిలో కనిపిస్తుంది. భారతదేశ జనాభా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వచ్చే పదిహేనేళ్లలో 50 ఏళ్లు దాటే పురుషుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆధునిక ఆహారపు అలవాట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం, పండ్లు, కూరగాయలను తక్కువగా తీసుకోవడం అనేది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఫైబర్ తక్కువగా ఉండి, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తిన్న పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేయకుండా, నిశ్చల జీవనశైలికి అలవాటు పడిన వారిలో కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే.

ఇలా చేస్తే సేఫ్..

ప్రతి ఏడాది ప్రొస్టేట్ క్యాన్సర్ కు సంబంధించి పరీక్షలు చేయించుకుంటే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఈ క్యాన్సర్ ను పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడిన పురుషుల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీరి లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. తీవ్రంగా అలసిపోతారు. మూత్రం వారి నియంత్రణలో ఉండదు. ఆందోళన, నిరాశ, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతాయి.

ఈ చికిత్సలతో త్వరగా కోలుకోవచ్చు

ప్రొస్టేట్ క్యాన్సల్ బారిన పడిన వారికి హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ అందిస్తారు. అలాగే శస్త్ర చికిత్స కూడా పడవచ్చు. భవిష్యత్తులో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ బారిన పడకూడదు అనుకునే పురుషులు ఈరోజు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజు గంటసేపు వాకింగ్ చేయడం లేదా రన్నింగ్ చేయడం వంటివి చేయాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది.

Related News

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Big Stories

×