EPAPER

Rosemary Tea Benefits: ఈ టీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

Rosemary Tea Benefits: ఈ టీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

Rosemary Tea Benefits: మన దేశంలో కొత్తిమీరను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అదే విధంగా విదేశాల్లో కొత్తిమీరకు బదులుగా వంటకాల్లో రోజ్ మేరీని వాడుతుంటారు. పుదీనా కుటుంబానికి చెందిన మొక్క రోజ్‌మేరి. ప్రధానంగా మాంసాహార వంటకాల్లో, బ్రెడ్, సూప్‌ల తయారీలో, సలాడ్లలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. సౌందర్య సాధనంగా కూడా దీన్ని వాడతారు.


అంతే కాకుండా మరి కొందరు హెర్బల్ టీ కూడా తయారు చేసుకుని తాగుతుంటారు. మరి ఈ హెర్బల్ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు అధికం: 
రోజ్ మేరిలో రోస్మారినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కేథలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ సి, ఇ, కె, బి6, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్‌లు కూడా అధికంగా ఉంటాయి.


ప్రయోజనాలు..
ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ: 
దీనితో తయారు చేసున్న టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ ఆసిడ్ చాలా శక్తిమంతమైనవి. ఇవి శరీరానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని కూడా అంటున్నారు.

జీర్ణక్రియ మెరుగు:
తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే జీర్ణ ఎంజైమ్‌లు చాలా ముఖ్యమైనవి. రోజ్ మేరిలో ఉండే పోషకాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుందని అంటున్నారు. చాలా మందిలో ఎక్కువగా కనిపించే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్య వంటి వాటిని ఇది క్లియర్ చేస్తుంది.

కండరాల నొప్పి నుంచి ఉపశమనం:
రోజ్ మేరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు రోజు ఈ టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×