EPAPER

Eye Exercises: మీ కంటి చూపును మెరుగుపరిచే బెస్ట్ వ్యాయామాలు ఇవే !

Eye Exercises: మీ కంటి చూపును మెరుగుపరిచే బెస్ట్ వ్యాయామాలు ఇవే !

Eye Exercises: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెబుతుంటారు. అలాంటి కళ్లను కాపాడుకోవడం ఎంతైనా అవసరం. వివిధ రకాల పోషకాలు, విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని రకాల వ్యాయామాలు కూడా కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అంతే కాకుండా కంటి ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. మెరుగైన కంటి చూపు కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. పామింగ్ :
ఈ వ్యాయామాన్ని ప్రారంభించడానికి ముందు సౌకర్యవంతమైన ప్రాంతాన్నిఎంచుకుని నేలపై కూర్చోవాలి. ఆ తర్వాత శ్వాసను గట్టిగా పీల్చుకోండి. ముక్కు ద్వారా శ్వాసను పీల్చుతున్నప్పుడు మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఈ తర్వాత మీ అరచేతులను వెచ్చగా అయ్యే వరకు గట్టిగా రుద్దండి . ఆ తర్వాత మీ మూసి ఉన్న కళ్లపై చేతులను పెట్టండి. ఈ వ్యాయామం చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసినప్పుడు అరచేతుల్లో ఉన్న వెచ్చదనం మీ కళ్లకు చేరుతున్నట్లు అనిపిస్తుంది. మీ కళ్లను మూసి ఉంచి సమానంగా ఊపిరి పీల్చుతూ ఈ వ్యాయామాన్ని కొనసాగించండి. కనీసం ఇలా 5 నిమిషాల పాటు చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2. బ్లింక్ చేయడం:
తరుచుగా కళ్లను మూయడం కాకుండా వాటికి కాసేపు విరామం ఇవ్వండి. ఒక్కో సారి కళ్లు మూసుకుని వాటిని తెరవడానికి కొన్ని సెకన్ల పాటు సమయం ఇవ్వండి. దీనిని తరుచుగా చేయడం వల్ల
కంటి కండరాలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అలసట నుంచి ఉపశమనం పొందటంలో కూడా సహాయపడుతుంది.


3. 20-20-20:
మీరు కనక కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తుంటే కనక ఈ వ్యాయామం మీకు ఎంతగానో ఉపయోగపడుంది. మీ ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి మీ కళ్లకు విరామం ఇవ్వండి. ఇలా విరామం తీసుకున్నప్పుడు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడండి.

4. జూమ్ చేయడం :
మీరు కూర్చున్న ప్రాంతంలోనే మీ చేతిని ముందుకు చాచి బొటన వేలును నేరుగా పైకి లేపి ఉంచండి. ఆ తర్వాత కొన్ని సెకన్ల పాటు మీ బొటన వేలినపై దృష్టిని కేంద్రీకరించండి. ఆ తర్వాత మీ చేతిని నెమ్మదిగా 3 అంగులాల దూరం వరకు తీసుకురండి. ఇప్పుడు మరో సారి బొటన వేలిపై మీ దృష్టిని కొన్ని సెకన్ల పాటు కేంద్రీకరించండి. ఆ తర్వాత మొదట మీ చేతిని ఉంచినట్లుగా ఉంచి మరో సారి ఇదే ప్రక్రియను కొనసాగించండి. ఇలా 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కంటి అలసటను ఇది తగ్గించడంతో పాటు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

5. రీ ఫోకస్ చేయడం..
స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడిపే వారు కళ్లను రిలాక్స్ చేయడం కోసం మీరు కూర్చున్న ప్రాంతం నుంచి దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టండి. ఆ తర్వాత మీ బొటన వేలుని మీ చేతును ముందుకు చాచి దానిపై కొన్ని సెకన్ల పాటు చూడండి. దీనిని మార్చి మార్చి 5 సార్లు చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

6. మీ కళ్లను తిప్పండి:
మీరు ఉన్న ప్రాంతంలోనే తలను కదిలించకుండా ఎడమ, కుడి వైపులను మార్చి మార్చి చూడండి. ఇలా చాలా సార్లు చేసిన తర్వాత తలను కదిలించకుండా చాలా సార్లు పైకి క్రిందికి చూడండి .
3 సెకన్లు ముఖ్యం..

  • ఒక చోట కూర్చోండి. ఆ తర్వాత 3 సెకన్ల పాటు నేరుగా పైకి చూడండి.
  • 3 సెకన్ల పాటు క్రిందికి చూడండి
  • 3 సెకన్ల పాటు మీ ముందు దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువును చూడండి.
  • 3 సెకన్ల పాటు ఎడమ, కుడి వైపు పైకి చూడండి.
  • ఆ తర్వాత మీ కళ్లను సవ్యదిశలో రెండు సార్లు, అపసవ్య దిశలో రెండు సార్లు తిప్పండి.

 

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×