Turmeric Milk: పసుపు పాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. చలికాలంలో పసుపు పాలు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పసుపు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
పసుపు పాలు శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు ఉంటాయి.చలికాలంలో రాత్రిపూట పసుపు పాలు తాగడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
పసుపు పాలను ఆయుర్వేదంలో అమృతం అని అంటారు. ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలు తాగడం వల్ల 5 ప్రయోజనాలు:
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది: పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం: పసుపులో ఉండే కర్కుమిన్ కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్, ఇతర కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతోొ ఇబ్బంది పడే వారు తరుచుగా పసుపు పాలు త్రాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది: పసుపు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది: పసుపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మొటిమలు, మచ్చలు , ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది: పసుపులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ప్రతి రోజు పసుపు పాలు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
Also Read: ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయ్
పసుపు పాలు ఎలా తయారు చేయాలి ?
ఒక గ్లాసు పాలు మరిగించండి. దానికి 1/2 టీస్పూన్ పసుపు వేసి కలపాలి. మీకు కావాలంటే, మీరు దీనికి కొద్దిగా నల్ల మిరియాలు కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే నల్ల మిరియాలు కర్కుమిన్ యొక్క శోషణను పెంచుతుంది. బాగా మిక్స్ చేసి వేడి వేడిగా తాగాలి. ఇలా తరుచుగా పసుపు పాలు త్రాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.