EPAPER

Fruits To Increase Platelets: మీ ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచే పండ్లు ఇవే !

Fruits To Increase Platelets: మీ ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచే పండ్లు ఇవే !

Fruits To Increase Platelets: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, టైపాయిడ్, మలేరియా, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ. ప్రస్తుతం ఈ పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు ప్రజలు. అందుకు కారణం రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోవడమే. కేవలం ఈ ఒక్క జ్వరం అనే కాదు మలేరియా వచ్చినా, ఇతరాత్ర ఇన్‌ఫెక్షన్ సోకినా రక్తం కణాల సంఖ్య పడిపోయే ఛాన్స్ ఉంటుంది.


కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అందుకే ఇలాంటి టైంలో తగిన మందులు వాడుతూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆ టైమ్‌లో పండ్లు కూడా క్రమంగా తీసుకుంటే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఆ పండ్లు ఏవో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి:
బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకే బొప్పాయి పండుతో పాటు ఆకులను తీసుకున్నా ప్రధానంగా డెంగీ జ్వరం రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రక్త హీనత వచ్చినప్పుడు రోజు పచ్చి బొప్పాయి ముక్కలు తిన్నా లేదా పడిగడుపున లేత బొప్పాయి ఆకుల రసం తాగినా ప్లేట్‌లెట్స్ కౌంట్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ :
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు ఐరన్, విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉంటుంది. ప్రతి రోజు గ్లాస్ దానిమ్మ రసాన్ని కొన్ని వారాలపాటు తాగడం వల్ల రక్త కణాల సంఖ్య భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కివీ:
దీనిలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఏ, సి, ఇ విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రక్తహీనత బి విటమిన్ లోపంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు రోజుకు రెండు కివీ పండ్లు తినడం మంచి ఫలితం ఉంటుంది. అలాగే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోకుండా కాపాడుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్:
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, పీచుజ ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి డ్రాగన్ పండు డెంగ్యూ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది .అంతేకాదు ఎరుపు రంగు డ్రాగన్ తినడం వల్ల హిమోగ్లోబిన్ ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగినట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. తరుచుగా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య త్వరగా పెరుగుతుంది.

Also Read:ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది తెలుసా !


జామ: 
అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో జామ ఒకటి దీనిలో విటమిన్ సి ఐరన్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్స్ పెంచడమే కాకుండా ఇవి రక్త కణాల నిర్మాణానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి డెంగ్యూ సోకినప్పుడు జామ పండ్లను తినడం వల్ల మంచిది. జామ పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×