EPAPER

Foods For Skin Glow: అందమైన ముఖం కోసం ఈ ఫుడ్ తినాల్సిందే !

Foods For Skin Glow: అందమైన ముఖం కోసం ఈ ఫుడ్ తినాల్సిందే !

Foods For Skin Glow: అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్‌లో వాడుతుంటారు. మరికొందరు హోం రెమెడీస్, చిట్కాలను పాటిస్తారు. కానీ స్కిన్ హెల్తీగా ఉండటానికి ఎక్స్టర్నల్ కేర్ తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందించడం కూడా ముఖ్యమే. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. కొన్ని రకాల ఫుడ్స్ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కీరదోస:
కీరదోస తీనడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కీరదోసలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ రక్షణకు ఉపయోగపడతాయి. కీరదోసతో పాటు పుచ్చకాయ వంటి పండ్లతో పాటు కూరగాయలు తినడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంటాము. ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. చర్మం నిగారింపును సంతరించుకోవడానికి కీరదోస చాలా ఉపయోగపడుతుంది.

పెరుగు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. లాక్టిక్ యాసిడ్ ఒక ఎక్స్ఫోఫోలియేట్ మాస్క్ లాగా పనిచేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో జింక్ విటమిన్ B2,B5,B12తో పాటు అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.


చిలకడదుంప:
విటమిన్ ఇ అధికంగా ఉండే చిలగడదుంప చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతాయి. మొటిమలు ఏర్పడటాన్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా యవ్వనంగా మారుస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ వృద్ధాప్య చర్మానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోటీ చేసి చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్వినోవా:
అధిక స్థాయిలో ఉండే రైబోఫ్లోవిన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. మచ్చలు, ముడతలు తక్కువగా కనిపించేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్వినోవాను తరచుగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చర్మంపై ఉన్న నల్ల మచ్చలు కూడా రాకుండాచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్వినోవాను తరచుగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. సహజంగా చర్మం మెరుస్తూ ఉండాలంటే పోషకాహారం తినాలి.

Also Read: జుట్టు రాలుతోందా ? ఈ హెయిర్ ప్యాక్ ఒక్క సారి ట్రై చేసి చూడండి

పాలకూర:
పాలకూరలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని మెరిపించడంలో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పు, చేపలు డార్క్ చాక్లెట్, వంటి ఆహార పదార్థాలు కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. గ్లోయింగ్ స్కిన్ పొందడం కోసం సహాయపడతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Big Stories

×