EPAPER

Obesity Causes: మనం చేసే ఈ పొరపాట్లే బరువు పెరగడానికి కారణం అవుతాయి తెలుసా ?

Obesity Causes: మనం చేసే ఈ పొరపాట్లే బరువు పెరగడానికి కారణం అవుతాయి తెలుసా ?

Obesity Causes: ప్రస్తుతం చాలా మంది ఎదర్కుంటున్న అనారోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్య కారణాలు, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్యంగా కూడా ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కుంటున్నారు.


శరీర బరువు బరువు ఎక్కువగా ఉన్నవారు కొవ్వును కరిగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది అతిగా తినడం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కేవలం అతిగా తినడం వల్ల లావు ఎవ్వరని నిపుణులు చెబుతున్నారు. నిత్య జీవితంలో కొన్ని అలవాట్ల వల్ల కూడా బరువు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇంతకీ బరువు పెరగడానికి ముఖ్య కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి:
నేటికాలంలో చాలామంది ఉద్యోగాల్లో భాగంగా నైట్ షిఫ్ట్‌‌లు చేస్తున్నారు. మరి కొంత మంది అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా మిడ్ నైట్ వరకు మెలకువగా ఉండడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఇలా ఉన్న తర్వాత మరుసటి రోజే అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తింటూ ఉంటారు. కాబట్టి ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


అధిక క్యాలరీలు: 
చాలా మంది పని ఒత్తిడి, టైం లేకపోవడం, వల్ల వివిధ కారణాల వల్ల శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి డైలీ నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

షుగర్ ఫుడ్ తినడం:
షుగర్ ఉండే పదార్థాలు, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కెర ఉన్న పదార్థాలను రోజు తినడం వల్ల అధిక బరువు సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాలరీలు ఎక్కువగా తీసుకోవడం:
పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, పాస్తా, నూడుల్స్ వంటి వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది.
రోజు భోజనం చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల ఊబకాయం వస్తుంది.

టీవీ చూస్తూ తినడం కొంత మందికి అలవాటు ఉంటుంది. టీవీ చూసినప్పుడు ఎంత తింటున్నామో ఏమి తింటున్నామో కూడా తెలియదు. దీనివల్ల అతిగా తిని బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మరి కొంత మంది వర్క్ ప్రెజర్ వల్ల కొంతమంది తినకుండా ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తర్వాత ఆకలి వేసినప్పుడు ఒకేసారి ఎక్కువగా తింటారు. ఇలా టైమ్‌కు తినకపోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది.

ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×