EPAPER

Rakhi Return Gifts For Sister: రాఖీ రోజు మీ సోదరికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి

Rakhi Return Gifts For Sister: రాఖీ రోజు మీ సోదరికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి

Rakhi Return Gifts For Sister: రాఖీ పండగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రత్యేక బంధాన్ని సూచిస్తుంది. సాంప్రదాయతతో కూడిన ఈ పండగ రోజు సోదరి తన సోదరునికి రాఖీని కట్టి తన ప్రేమను తెలియచేస్తుంది. అంతే కాకుండా అతడి క్షేమాన్ని కోరుకుంటుంది. సోదరుడు తన జీవితాంతం ఆమెను కాపాడుతానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ఆచారం ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. ఇంత ప్రత్యేకమైన రోజు మీ సోదరికి సరైన బహుమతి ఇవ్వడం వల్ల ఈ రోజు మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. అందుకే మీకు మీ సోదరి ఎంత ఇష్టమో తెలియజేసేలా కొన్ని బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి.


ఆభరణాలు:
ఆడవారికి సాధారణంగా ఆభరణాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అద్భుతమైన బహుమతి. అందుకే రాఖీ పండగ రోజు బంగారు లేదా వెంటి ఆభరణాలను ఆమె గిఫ్ట్ గా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల వారు సంతోషంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా వారి దగ్గర లేని, లేదా వారు కొనాలని అనుకున్న ఆభరణాలు ఏవైనా ఉంటే వాటి గురించి తెలుసుకుని కొని వారికి గిఫ్ట్ గా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వారు వారు చాలా సర్‌ప్రైజ్ అవుతారు. అంతే కాకుండా మీ అక్క లేదా చెల్లి యొక్క పేరుతో కూడిన మొదటి అక్షరాలతో లాకెట్ ఉన్న చైన్ లాంటిది ఇవ్వడం కూడా మంచి ఆలోచన. వీటితో వారిని ఇంప్రెస్ చేయవచ్చు. ఇవే కాకుండా బ్రేస్ లేట్, ఉంగరాలను కూడా ఇవ్వవచ్చు. ఇవి మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఇలాంటి గిఫ్ట్స్ చాలా కాలం పాటు పాడవకుండా కూడా ఉంటాయి.

ఫోటో ఆల్బమ్:


ఇది మరొక మంచి ఆలోచన. ఫోటో ఆల్బమ్ ఇవ్వడం వల్ల వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమూల్యమైన జ్ఞాపకాల్ని సేకరించి వాటిని అందంగా రూపొందించిన ఆల్బమ్ తయారు చేయించండి. అంతే కాకుండా దానికి ఒక మంచి కోట్ యాడ్ చేయించడంతో పాటు తేదీని కూడా దానిపై మెన్షన్ చేయండి. ఈ బహుమతి చూసిన ప్రతీ సారి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇది సెంటిమెంట్ బహుమతి.

మొబైల్ ఫోన్స్:
మీ సోదరికి మొబైల్ ఫోన్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి. వారికి ఇష్టమైన ఫోన్ మోడల్ వారి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని గిఫ్ట్ చేయండి. ఇలా మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా మంచి ఆలోచన. ఇది వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇష్టమైన రచయిత రాసిన రాసిన పుస్తకం:

ఒక వేళ మీ సోదరికి గనుక పుస్తకాలు చదివే అలవాటు ఉంటే వారికి మంచి పుస్తకం బహుమతిగా ఇవ్వండి. వారికి ఏ రచయిత రాసిన పుస్తకాలు అయితే చాలా ఇష్టమో వారు రాసిన పుస్తకాలను ఇవ్వడం మంచిది.బెస్ట్ పుస్తకాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన. మీరు ఇవ్వాలనుకున్న బుక్ ను అందంగా ప్యాకింక్ చేసి రాఖీ కట్టినసమయంలో వారికి ఇవ్వండి.దీంతో ఆమె చాలా సంతోషంగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Also Read:  ఫేషియల్స్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా ? ఇంట్లోనే చేసుకోండిలా !

టెక్ గార్జెట్:
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా అందరూ టెక్ గార్జెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. మీరు కూడా సరికొత్తగా ఈ వస్తువులు మీ సోదరికి బహుమతిగా ఇస్తే బాగుంటుంది. అందుకే ఒక జీత హెడ్ ఫోన్ అయినా స్మార్ట్‌వాచ్ అయినా లేదా పోర్టబుల్ ఛార్జర్ అయినా బహుమతిగా ఇవ్వండి. మీ గిఫ్ట్ తో వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఫ్యాషన్ ఉపకరణాలు:
మోడల్‌గా, పాషన్ గా ఉండడం మీ సోదరికి ఇష్టమైతే కనుక స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ లేదా, మేకప్ కిట్ లేదా స్టైలిష్ సన్ గ్లాసెస్ ఇచ్చి ఆమెను కాశ్చర్యపరచండి. మీ సోదరి వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను ఎంచుకోండి. దీంతో వారు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×